టీ సర్కార్ జర్నలిస్టుల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది.!చెక్కుల పంపిణీ చేసిన అల్లం నారాయణ.!

హైదరాబాద్ : విధి నిర్వహణలో ఉంటూ మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలుస్తూ, ఆర్థిక భరోసాను కల్పిస్తున్న సంస్థ దేశంలోనే తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి మాత్రమే అని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. బుధవారం మాసబ్ ట్యాంక్ లోని సమాచార భవన్ లో గల మీడియా అకాడమీ కార్యాలయంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి 65 మంది కోవిడ్-19తో మరణించిన పాత్రికేయ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు.

 మీడియా అకాడమీ జర్నలిస్టులకు అండ.. కరోనా బాదితులకు ఆర్థిక సాయం

మీడియా అకాడమీ జర్నలిస్టులకు అండ.. కరోనా బాదితులకు ఆర్థిక సాయం

జర్నలిస్టుల కుటుంబాలకు 2లక్షల రూపాయల వంతున చెక్కులను, 40 మంది సాధారణ మరణం చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఒక లక్ష రూపాయల చొప్పున, ప్రమాదాలు/తీవ్ర అనారోగ్యం బారిన పడిన 8 మంది వర్కింగ్ జర్నలిస్టులకు యాభై వేల రూపాయల చొప్పున మొత్తం 1 కోటి 74 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, జర్నలిస్టు, ఆందోల్ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్, శాసనమండలి సభ్యులు గోరటి వెంకన్నలతో కలిసి లబ్దిదారులకు అందజేశారు.

 జర్నలిస్టుల సంక్షేమ నిధి.. ఎంతో మంది జర్నలిస్టులకు పెన్నిధి అన్న అల్లం నారాయణ

జర్నలిస్టుల సంక్షేమ నిధి.. ఎంతో మంది జర్నలిస్టులకు పెన్నిధి అన్న అల్లం నారాయణ

ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రశాఖర్ రావు ప్రత్యేక చొరవతో జర్నలిస్టుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారని, ఇప్పుడు ఈ నిధి జర్నలిస్టుల పెన్నిధిగా మారిందని తెలిపారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమం కొరకు జర్నలిస్టుల సంక్షేమ నిధిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఇందులో భాగంగా జర్నలిస్టుల సంక్షేమ నిధికి మొత్తం 42 కోట్ల రూపాయలు విడుదల అయ్యాయని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఇప్పటి వరకు 353 కుటుంబాలకు లక్ష రూపాయల వంతున, 116 మందికి 50 వేల చొప్పున ఆర్థిక సహాయం చేశామన్నారు.

 మూడు వేల రూపాయల పెన్షన్..నెలకు వెయ్యి చొప్పున ట్యూషన్ ఫీజు ఇస్తామన్న నారాయణ

మూడు వేల రూపాయల పెన్షన్..నెలకు వెయ్యి చొప్పున ట్యూషన్ ఫీజు ఇస్తామన్న నారాయణ

అంతేగాక కరోనా వైరస్ బారిన పడిన 3915 మంది జర్నలిస్టులకు తక్షణ సహాయంగా మొదటి విడత కరోనా వైరస్ బారిన పడిన వారికి 20 వేల చొప్పున, రెండవ విడత కరోనా వైరస్ బారిన పడిన వారికి 10 వేల చొప్పున 5.70 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని ఆయన తెలిపారు. ఇప్పుడు ఆర్థిక సహాయం అందించిన జర్నలిస్టు కుటుంబాలకు నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ ను అయిదేళ్లపాటు అందిస్తామని, ఆయా కుటుంబాలలోని ఒకటి నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ట్యూషన్ ఫీజును చెల్లిస్తామని ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.

 తన పాటలకు విస్తృత ప్రచారం కల్పించింది జర్నలిస్టులే.. గుర్తు చేసుకున్న ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న

తన పాటలకు విస్తృత ప్రచారం కల్పించింది జర్నలిస్టులే.. గుర్తు చేసుకున్న ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న

జర్నలిస్టు, ఆందోల్ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఉద్యమకారులకు మొదటి ప్రాధాన్యతనిస్తూ మొట్ట మొదటగా తెలంగాణ ప్రెస్ అకాడమిని ఏర్పాటు చేసి జర్నలిస్టు నాయకుడు అల్లం నారాయణను చైర్మన్ గా నియామకం చేసారని అన్నారు.
శాసనమండలి సభ్యులు గోరటి వెంకన్న మాట్లాడుతూ, తాను ఈ రోజు ఈ స్థానంలో ఉండడానికి జర్నలిస్టుల మిత్రుల సహకారమే కారణమన్నారు. తన పాటలకు విస్తృత ప్రచారం గావించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జర్నలిస్టుల కుటుంబాల వారు ఆర్థిక సహాయాన్ని ఉపయుక్తం చేసుకోవాలని ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+