డ్రైవర్ గురునాధం మృతి: తహసీల్దార్ విజయారెడ్డిని కాపాడబోయి: చికిత్స పొందుతూ కన్నుమూత..!
తహసీల్దార్ విజయారెడ్డిని కాపాడబోయి తీవ్రంగా గాయాలపాలైన డ్రైవర్ గురునాధం మృతి చెందారు. అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజాయా రెడ్డి పైన పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో ఆమె కార్యాలయం లో నే ప్రాణాలు విడిచారు. తన అధికారి ప్రాణాలు కాపాడేందుకు డ్రైవర్ గురునాధం ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో గురునాధంకు 84 శాతం మేర కాలింది. దీంతో..సిబ్బంది ఆయనను అపోలో డిఆర్ఢీఓ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూనే గురునాధం ప్రాణాలు విడిచారు. అదే విధంగా ఈ దారుణానికి కారణమైన సురేష్ సైతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే ఈ ఘటన పైన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆందోళనలు జరుగుతున్నాయి. పోలీసుల విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
Recommended Video

అధికారిని రక్షించబోయి..
గురునాధం అబ్దుల్లా పూర్ మెట్ తహసీల్దార్ విజయా రెడ్డి వద్ద డ్రైవర్ గా పని చేస్తున్నారు. తన అధికారి పైన కార్యాలయంలోనే సురేస్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసాడు. ఆ సమయంలో విజయా రెడ్డిని కాపాడేందుకు గురునాధం తీవ్రంగా ప్రయత్నించాడు. ఆ సమయంతో తన ఒంటికి గాయాలు అయ్యాయి. కొద్ది సేపటికే తహసీల్దార్ విజయారెడ్డి అక్కడే ప్రాణాలో కోల్పోయారు. దీంతో..తీవ్రంగా గాయపడిన డ్రైవర్ గురునాధ్ ను కార్యాలయ సిబ్బంది డీఆర్డీఓ అపోలో ఆస్పత్రికి తరలించారు.
అప్పటికే గురునాధం శరీరం 84 శాతం కాలిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. అయితే, అత్యవసర చికిత్సా విభాగంలో చికిత్స కొనసాగించారు. చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం డ్రైవర్ గురునాధం మృతి చెందారు. దీంతో..ఈ ఘటనలో తహసీల్దార్ విజయా రెడ్డి..డ్రైవర్ గురునాధంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఘటనలో గాయపడని అటెండర్ చంద్రయ్య ప్రస్తుతం 50 శాతం కాలిన గాయాలతో అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

విజయారెడ్డి ప్రాణాలు కాపాడాలని..
తహసీల్దార్ కార్యాలయంలోనే తన ఛాంబర్ లో విజయారెడ్డి విధులు నిర్వహిస్తున్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎలాగైనా విజయారెడ్డిని కాపాడాలని డ్రైవర్ గురునాధం..అటెండర్ చంద్రయ్య చివరి నిమిషం వరకు ప్రయత్నించారు. తొలుత మంటల్లో విజయారెడ్డి కనిపించగానే ఈ ఇద్దరు అయోమయానికి గురయ్యారు. ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో మంటలను సైతం లెక్క చేయకుండా తమ వంతు ప్రమత్నం చేసారు. ఆ సమయంలో వారు సైతం మంటల్లో తీవ్రంగా గాయపడ్డారు.
కారు డ్రైవర్ గురునాథ్, అటెండర్ చంద్రయ్యను కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఎల్ అపోలో ఆస్పత్రికి తరలించారు. కాగా, కొద్ది సేపటి క్రితం డ్రైవర్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అటెండర్ చంద్రయ్య చికిత్స పొందుతున్నాడు. మొత్తంగా ఈ వ్యవహారం పైన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు కారకుడైన సురేష్ ప్రస్తుతం ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని దగ్గర నుండి పోలీసులు వాంగ్మూలం సేకరించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications