రుణం చెల్లించలేదని తలసాని కూతురు, అల్లుడు ఆస్తులు అటాచ్?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బంధువుల ఆస్తులను బ్యాంక్ అటాచ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన కూతురు, అల్లుడి ఆస్తులను బ్యాంకు అటాచ్ చేసినట్లుగా మంగళవారం వార్తలు వస్తున్నాయి.
ఆస్తిని బ్యాంకులకు తాకట్టు పెట్టి రుణాలు పొందినట్లుగా తెలుస్తోంది. గత మూడేళ్లుగా బ్యాంకులకు రుణాలు చెల్లించలేదని, అందుకే అటాచ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. పలు దఫాలుగా నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించలేదని అంటున్నారు.

బ్యాంక్ అధికారులు చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం వారి ఆస్తులను జఫ్తు చేయాలని మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, బ్యాంకు అధికారులు వారి ఆస్తులను జఫ్తు చేశారు. రెండు విల్లాలు, ఏడు ప్లాట్లను అధికారులు సీజ్ చేశారని తెలుస్తోంది.
కాగా, తలసాని కుమార్తె శ్వేత, అల్లుడు ప్రభాకర్ యాదవ్ సహా ఐదుగురు బ్యాంకు నుంచి రుణం పొందారని తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications