యనమలకు కాంట్రాక్టులు ఎక్కడిచ్చాం: రేవంత్‌‌పై తలసాని సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుకు తెలంగాణలో ఎక్కడ కాంట్రాక్టులు కట్టబెట్టారో చెప్పాలని టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చెప్పలేదన్నారు తెలంగాణ రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

  Revanth Reddy Says Goodbye To TDP రేవంత్‌తో పాటు 25మంది ? | Oneindia Telugu

  వాళ్ళంతా కెసిఆర్ మనుషులే: టిడిపి నేతలపై రేవంత్‌ సంచలనం

  తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకొని నిర్వహించిన బిఎసి సమావేశం తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం నాడు మీడియాతో మాట్లాడారు. టిడిపిలో చోటుచేసుకొన్న పరిణామాలపై, కాంగ్రెస్ నేతలపై తలసాని శ్రీనివాస్ యాదవ్ విరుచుకుపడ్డారు.

  ట్విస్ట్:టిడిఎల్పీ నుండి కంప్యూటర్, ఫైళ్ళను తీసుకెళ్ళిన రేవంత్

  తెలంగాణ సీఎం కెసిఆర్ అనంతపురం పర్యటన సందర్భంగా రేవంత్‌రెడ్డి చేసిన విమర్శలను తలసాని శ్రీనివాస్ యాదవ్ తప్పుబట్టారు. టిడిపి పరిణామాలపై, కాంగ్రెస్ నేతల చలో అసెంబ్లీ పరిణామాలపై తలసాని విమర్శలు గుప్పించారు.

  చిచ్చుపై బాబు ఆరా: కత్తులు దూసుకొంటున్న రమణ, రేవంత్‌రెడ్డి

  యనమలకు కాంట్రాక్టులు ఎక్కడిచ్చామన్న తలసాని

  యనమలకు కాంట్రాక్టులు ఎక్కడిచ్చామన్న తలసాని

  యనమలకు కాంట్రాక్టులు ఎక్కడిచ్చామో రేవంత్‌రెడ్డి చెప్పలేదని తెలంగాణ రాష్ట్ర వశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్. సీఎం పక్క రాష్ట్రానికి వెళ్లినప్పుడు నాయకులు మర్యాదపూర్వకంగా కలవడాన్ని తప్పుబట్టడం సరికాదని తలసాని అన్నారు. యనమల రామకృష్ణుడితో పాటు పరిటాల సునీత కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం నుండి కాంట్రాక్టులు దక్కాయని రేవంత్‌రెడ్డి తీవ్రమైన విమర్శలు చేశారు.అయితే యనమల రామకృష్ణుడు, తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీప బంధువు కాంట్రాక్టర్‌గా ఉన్నారు. ఆయనను ఉద్దేశించి రేవంత్ ఆరోపణలు చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  అసలు టిడిపిలో ఎంతమంది ఎమ్మెల్యేలున్నారు

  అసలు టిడిపిలో ఎంతమంది ఎమ్మెల్యేలున్నారు

  తెలంగాణ టీడీపీ సంక్షోభం ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు.అసలు టీడీపీలో ఎంతమంది ఎమ్మెల్యేలున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ టీడీపీలో ఉన్నదే ముగ్గురు ఎమ్మెల్యేలని, వారిలో ఒకాయన మీడియా హైప్‌ కోసం తాపత్రయపడతారని.. ఇంకొకాయన పైరవీలు చేస్తారని.. మరొకరు కండువానే కప్పుకోరని ఆయన ఏద్దేవా చేశారు.

  3. రేవంత్‌రెడ్డి గొప్పగా ఊహించుకొంటా

  3. రేవంత్‌రెడ్డి గొప్పగా ఊహించుకొంటా

  రేవంత్‌రెడ్డితననుతానుఎక్కువగాఊహించుకుంటున్నారన్నారు. కాంగ్రెస్‌ అనే మహా సముద్రంలో రేవంత్‌ ఎంతని తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రశ్నించారు. ఎవరిని ఎలా వాడుకోవాలో కాంగ్రెస్‌కు బాగా తెలుసునని తలసాని అభిప్రాయపడ్డారు.

   2019లో వంద సీట్లు మావే

  2019లో వంద సీట్లు మావే

  2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి వంద సీట్లను గెలుచుకొంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.కాంగ్రెస్ నేతలు సభలో ఏం చెప్పాలో సభలో చెప్పాలని తలసాని సూచించారు. సభలో చెప్పకుండా ధర్నాలు, ఛలో అసెంబ్లీలు నిర్వహించడాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ తప్పుబట్టారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telangana minister Talasani Srinivas Yadav made allegations on Tdp and congress leaders on Thursday. Talasani spoke to media on Thursday at Hyderabad.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి