దాసరి నారాయణ రావు ఆరోగ్యంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
దాసరి నారాయణరావు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనవద్దని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం నాడు చెప్పారు.
హైదరాబాద్: దాసరి నారాయణరావు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనవద్దని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం నాడు చెప్పారు. ఊపిరితిత్తులు, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న దాసరికి కిమ్స్‌లో ఆపరేషన్ జరుగుతోంది.
దాసరిని మంత్రి తలసాని పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైద్యులు ఎప్పటికప్పుడు చికిత్స అందిస్తున్నారన్నారు. దాసరి ఆరోగ్యం గురించి ఆందోళన చెందొద్దన్నారు. సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారని చెప్పారు.

కాగా, దాసరి రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని కిమ్స్ వైద్యులు తెలిపారు. అన్నవాహికలో సమస్యను గుర్తించి చికిత్స అందిస్తుండగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ వచ్చిందని తెలిపారు.
శస్త్రచికిత్స పూర్తయిందని, డయాలసిస్, వెంటిలేటర్ సాయంతో వైద్యం అందిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం దాసరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, రెండు మూడు రోజుల్లో కోలుకుంటారన్నారు.
కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దాసరిని మంగళవారం పలువురు పరామర్శించారు. నటుడు మోహన్ బాబు, నటి జయసుధ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆసుపత్రిలో పరామర్శించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications