Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Vyooham: ఆర్జీవీ డెన్ ముందు ఉద్రిక్తత, వ్యూహం పోస్టర్ల దహనం: కుక్కలంటూ రాంగోపాల్ వర్మ

హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా సినిమా 'వ్యూహం' (Vyooham) వివాదాలకు కారణమవుతోంది. ఈ చిత్రంలో తమ అభిమాన నేతలను అభ్యంతకరంగా చూపించారంటూ టీడీపీ, జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలోని రాంగోపాల్ వర్మ ఆఫీస్ (Den ఎదుట సోమవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది.

డెన్ ఎదుట వ్యూహం సినిమాకు వ్యతిరేకంగా కొందరు ఆందోళనకు దిగారు. వ్యూహం మూవీ పోస్టర్లను, ఆర్జీవీ దిష్టిబొమ్మను తగలబెట్టారు. వ్యూహం సినిమాను బ్యాన్ చేయాలంటూ నినాదాలు చేశారు. రాంగోపాల్ వర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హంగామా చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆందోళనకారులను చెదరగొట్టారు.

TDP activists protest in front of Ram Gopal Varma office in Hyderabad

కాగా, ఆంధ్రప్రదేశ్ సీఎం, వైయస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఆధారంగా ఆర్జీవీ ఈ వ్యూహం సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. వైయస్సార్ చనిపోయిన తర్వాత జగన్ పొలిటికల్ కెరీర్‌లో జరిగిన సంఘటనలను ఆర్జీవీ ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌లను అభ్యంతరకరంగా చిత్రీకరించారని ఆ పార్టీల శ్రేణులు మండిపడుతున్నాయి.

కాగా, నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన వ్యూహాన్ని సెన్సార్ బోర్డ్ రిలీజ్ ను ఆపేసింది. అయితే, ఆర్జీవీ వెనక్కి తగ్గకుండా.. ఎట్టకేలకు సెన్సార్ నుంచి అనుమతి పొందారు. వ్యూహం చిత్రం డిసెంబర్ 29న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ, జనసేన శ్రేణులు ఆర్జీవీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ అభిమాన నేతలను అవమానించేలా చూపిస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు.

చంద్రబాబు, పవన్, లోకేష్‌పై కామెంట్స్ చేస్తూ ఊరుకునేది లేదంటున్నారు. కాగా, తన ఆఫీసు ముందు ఆందోళన చేయడంపై వర్మ తీవ్రంగా స్పందించారు. 'నా ఆఫీసు ముందు మీ కుక్కలు మొరుగుతున్నవి.. ఒక్కసారిగా పోలీసులు రాగానే పారిపోయాయి' అంటూ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేశారు ఆర్జీవీ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+