'ఓల్డ్ సిటీలో మజ్లిస్‌ని గెలిపిస్తున్నారు, సీమాంధ్రులకి గౌరవం దక్కాలంటే టిడిపి గెలవాలి'
హైదరాబాద్: హైదరాబాదులో సీమాంధ్రులకు గౌరవం దక్కాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పాతబస్తీలో ముస్లీంలు మజ్లిస్ పార్టీని గెలిపించుకుంటున్నారని చెప్పారు. ఆంధ్రులు కూడా టిడిపిని గెలిపించుకోవాలన్నారు.
2019 ఎన్నికలలో తెలంగాణలో ఏపీ టిడిపి నేతలు ప్రచారం చేస్తారని చెప్పారు. తెలంగాణ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారం చేస్తారని చెప్పారు.

సైబరాబాద్ చంద్రబాబు సృష్టి: సోమిరెడ్డి
హైదరాబాదులో సైబరాబాద్ నగరాన్ని సృష్టించింది చంద్రబాబు అని మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరులో అన్నారు. హైదరాబాదులో ఏడాదికి రూ.20వేల కోట్ల ఆదాయం తీసుకు వచ్చిన ఘనత చంద్రబాబుదే అన్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు.
ఓటేయాలి: ఎంపీ వినోద్
మేధావుల మౌనం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని తెరాస ఎంపీ వినోద్ అన్నారు. హైదరాబాదులోని వివేకానందనగర్ డివిజన్‌లో ఎంపీలు వినోద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమక్షంలో రెండువేల మంది వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెరాసలో చేరారు.
ఈ సందర్భంగా వినోద్ మాట్లాడారు. వివేకానంద నగర్‌ను ఒక మోడల్ డివిజన్‌గా మారుస్తామన్నారు. మేధావులు ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి ఇది ప్రమాదకరమన్నారు. ఒటు హక్కును వినియోగించుకున్న వారికే ప్రశ్నించే వీలుంటుందన్నారు.
ఓటింగ్ శాతాన్ని పెంచడంలో ప్రతి పౌరుడు ఒక సైనికుడిగా పని చేయాలని, కూకట్‌పల్లిలో మిడ్‌నైట్ వరకు ట్రాఫిక్ జామ్ ఉంటుందని, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. హైదరాబాద్‌ను ట్రాఫిక్‌లేని నగరంగా మారుస్తామని, హైదరాబాద్‌ను క్లీన్, స్మార్ట్, గ్రీన్‌సిటీగా మారుస్తమన్నారు.












Click it and Unblock the Notifications