విడతలవారీగా.. పోలీసుల అపసోపాలు, మాగంటికి గాయం (పిక్చర్స్)
హైదరాబాద్: డివిజన్ల పునర్విభజన గందరగోళంగా చేశారని, కనీసం అభ్యంతరాలు తెలిపేందుకూ గడువు పెంచడం లేదని టిడిపి, బిజెపి గురువారం చేపట్టిన జిహెచ్ఎంసీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది.
విడతల వారీగా ఆందోళన చేపట్టడంతో వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులకు, కార్యకర్తలు మాధ్య తోపులాట చోటుచేసుకుంది.
ఈ క్రమంలో టిడిపి నగర అధ్యక్షులు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కాలికి గాయమైంది. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు అస్వస్థతకు గురయ్యారు.

ధర్నా
డివిజన్ల పునర్విభజనలో అవకతవకలు జరిగాయని ప్రతిపక్షాలు అభ్యంతరం తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని బిజెపి శాసనసభా పక్ష నేత డాక్టర్ కెలక్ష్మణ్ అన్నారు.

ధర్నా
టిడిపి, బిజెపులకు పట్టున్న, ఇది వరకు గెలిచిన డివిజన్లను ఛిన్నాభిన్నం చేశారని డాక్టర్ కె లక్ష్మణ్ ఈ సందర్భంగా ఆరోపించారు.

ధర్నా
మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ.. డివిజన్ల పునర్విభజనను ఏకపక్షంగా చేపట్టిన ప్రభుత్వం, ఓటర్ల తొలగింపునూ ఇష్టానుసారంగా చేసిందన్నారు.

ధర్నా
ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యపద్ధతిలో నిరసన తెలిపితే పోలీసుల ద్వారా అడ్డుకుంటోందన్నారు.

ధర్నా
బిజెపి, టిడిపి నేతలు విడతల వారీగా మున్సిపల్ కార్పోరేషన్ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. దీంతో పలుమార్లు వాగ్వాదం, అరెస్టులు జరిగాయి.

ధర్నా
టిడిపి గ్రేటర్ అధ్యక్షులు మాగంటి గోపినాథ్, రంగారెడ్డి అధ్యక్షుడు ప్రకాశ్ గౌడ్, గ్రేటర్ అధ్యక్షుడు వెంకట రెడ్డి, ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తోపులాటలో మాగంటి కాలికి గాయమైంది.

ధర్నా
బిజెపి నేతలు డాక్టర్ కె లక్ష్మణ్, చింతల రామచంద్రా రెడ్డి, టిడిపి నేతలు అరికెపూడి గాంధీ, తూళ్ల వీరేందర్ గౌడ్ నేతృత్వంలో వేర్వేరుగా ఆందోళన చేశారు.

ధర్నా
ఒకరిని అరెస్టు చేయగానే మరో నాయకుడు కార్యకర్తలతో కలిసి రావడంతో పోలీసులు అపసోపాలు పడ్డారు. దాదాపు రెండున్నర గంటల పాటు ఆందోళనలు, అరెస్టులు కొనసాగాయి.












Click it and Unblock the Notifications