టీడీపీ చీఫ్ చంద్రబాబు - మంత్రి కేటీఆర్ పలకరింపులు..!!

సుదీర్ఘ కాలం తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు - తెలంగాణ మంత్రి కేటీఆర్ మధ్య పలకరింపులు చోటు చేసుకున్నాయి. రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ నామమాత్రంగానే వ్యవహరిస్తోంది. పూర్తిగా ఏపీ పైనే ఫోకస్ పెట్టింది. అయితే, ఇప్పుడు ఈ ఇద్దరు ఎదరు ఎదురెదురుగా తారస పడటంతో మర్యాద పూర్వకంగా పలకరించుకున్నారు. ప్రముఖ సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో పలువురు రాజకీయ - సినీ రంగ ప్రముఖులు ఆయనకు తుది నివాళి అర్పించేందుకు ఆయన నివాసానికి చేరుకున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కృష్ణంరాజు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. రెబల్ స్టార్ ను కోల్పోవటం బాధాకరమన్నారు. చరిత్రలో కృష్ణంరాజు కు ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ప్రజలకు సేవ చేసేందుకే ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేసారు. సినీ పరిశ్రమ ఒక ప్రముఖుడిని కోల్పోవటం..విషాదకరమని చంద్రబాబు పేర్కొన్నారు. కృష్ణంరాజు స్పూర్తి భావి తరాలకు ఆదర్శకంగా ఉండాలని ఆకాంక్షించారు.

TDP Chief Chandra Babu and Minister KTR pays tributes to Krishnam Raju

ప్రభాస్ ను చంద్రబాబు పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. కృష్ణంరాజు లేని లోటు ప్రభాస్ తీర్చాలని చంద్రబాబు పేర్కొన్నారు. పరామర్శ ముగించుకొని చంద్రబాబు వెళ్తున్న సమయంలో..అక్కడకు మంత్రి కేటీఆర్ వచ్చారు. కృష్ణంరాజు కి నివాళి అర్పించేందుకు కేటీఆర్ వచ్చిన సమయంలో చంద్రబాబు ఎదురయ్యారు. ఇద్దరూ మర్యాద పూర్వకంగా అభివాదం చేసుకోవటంతో పాటుగా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులను ఓదార్చిన మంత్రి కేటీఆర్..ప్రభాస్ ను పరామర్శించారు. రేపు తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+