జూబ్లీహిల్స్ లో బీజేపీతో కలిసి బిగ్ ప్లాన్ ? విజయశాంతికి టీడీపీ కౌంటర్..!
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ అభ్యర్ధుల ఎంపిక, గెలుపు వ్యూహరచనల్లో తలమునకలవుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉండొచ్చన్న అంచనాల మధ్య అదృష్టం పరీక్షించుకునేందుకు మిగతా పార్టీలు కూడా ప్రయత్నిస్తున్నాయి. ఇదే క్రమంలో వారి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ఇదే క్రమంలో కాంగ్రెస్ నేత విజయశాంతి ఓ ట్వీట్ చేశారు. ఇందులో జూబ్లీహిల్స్ ఊప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని తేలడంతో బిఆర్ఎస్ పార్టీ అనైతిక అవగాహన కుదుర్చుకునేందుకు కుట్రలు చేస్తున్నట్లువార్తలు వస్తున్నాయన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిజెపి పోటీ చేస్తున్న కారణంగా కమలం పార్టీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ మిత్ర ధర్మం కోసం ఈ ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించిందని తెలిపారు. దీంతో బిజెపి ఈ ఉప ఎన్నికలో డమ్మీ అభ్యర్థిని బరిలోకి దింపి, తన రహస్య మిత్ర పక్షమైన బిఆర్ఎస్ ను గెలిపించేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోందన్నారు.

జూబ్లీహిల్స్ ఊప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని తేలడంతో బిఆర్ఎస్ పార్టీ అనైతిక అవగాహన కుదుర్చుకునేందుకు కుట్రలు చేస్తున్నట్లువార్తలు వస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిజెపి పోటీ చేస్తున్న కారణంగా కమలం పార్టీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ మిత్ర ధర్మం కోసం ఈ… pic.twitter.com/lZmuxZIK7X
— VIJAYASHANTHI (@vijayashanthi_m) October 6, 2025
పైకి బిజెపికి మద్దతు ఇస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రకటించినా...రహస్యంగా బిఆర్ఎస్ గెలుపు కోసం తెలుగుదేశం కార్యకర్తలు పనిచేయాలని సందేశం పంపినట్లు వార్తలు వస్తున్నాయని విజయశాంతి తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగో కాంగ్రెస్ గెలుస్తుంది కాబట్టి..ఆ విజయావకాశాల్ని దెబ్బతీయాలనే కుట్రతో, టిడిపి మద్దతు బిఆర్ఎస్ కు లభించే విధంగా బిజెపి రహస్య అవగాహన కుదుర్చినట్లు సమాచారం అందుతోందన్నారు. ఇలా కాంగ్రెస్ ను దెబ్బ కొట్టేందుకు అవగాహన కుదుర్చుకుంటున్న బిఆర్ఎస్, బిజెపి, తెలుగుదేశం పార్టీల అవకాశవాద రాజకీయాన్ని జూబ్లీహిల్స్ ఓటర్లకు వివరించే బాధ్యతను స్థానికంగా ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తీసుకోవాలని విజయశాంతి ట్వీట్ లో కోరారు.

మీ భయం ఏంటి @vijayashanthi_m గారు? తలా తోకా లేకుండా మాట్లాడుతున్నారుగా భయంతో!!! ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు మీకు చేతకాక మా తెలుగు దేశం మీద పడతారేం??? ఉనికి చాటుకుంటున్నారా నేను కూడా ఉన్నా పార్టీలో అని??? అయినా మీరు ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి టీడీపీ మీద పడి ఏడుస్తారెందుకు? ఒకటి… https://t.co/7mpvY2DOFG
— JYOTHSNA TIRUNAGARI (@jyothsna_tdp) October 7, 2025
దీనిపై హైదరాబాద్ టీడీపీ నేత జ్యోత్స్న తిరునగరి స్పందించారు.మీ భయం ఏంటి విజయశాంతి అని ప్రశ్నించారు. తలా తోకా లేకుండా మాట్లాడుతున్నారుగా భయంతో!!! ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు మీకు చేతకాక మా తెలుగు దేశం మీద పడతారేం??? ఉనికి చాటుకుంటున్నారా నేను కూడా ఉన్నా పార్టీలో అని??? అయినా మీరు ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి టీడీపీ మీద పడి ఏడుస్తారెందుకు? ఒకటి గుర్తు పెట్టుకొండి !!! టీడీపీ అనేది ప్రజలచేత ప్రజల కోసం ప్రజల కోసం. మాకు విలువలు ఉన్నాయి మరియు మేము వాటికి కట్టుబడి ఉంటాము. చౌకబారు వ్యాఖ్యలు చేయడం ద్వారా మిమ్మల్ని మీరు దిగజార్చుకోకండి!!!! అంటూ జ్యోత్స్న ఘాటు కౌంటర్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications