టిడిపిలో భయం: సండ్రకు ఆంధ్ర ఎసిబి అధికారుల శిక్షణ?
హైదరాబాద్: తెలంగాణ ఎసిబి విచారణలో తమ పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య ఏం చెప్పాడనే ఆందోళన తెలుగుదేశం పార్టీలో నెలకొంది. కస్టడీకి అప్పగిస్తే ఆయన నుంచి ఎసిబి ఏ విధమైన వివరాలు రాబడుతుంది, ఆయన ఏం చెప్తారనే భయం కూడా చోటు చేసుకుంది.
కాగా, అనారోగ్యం పేరుతో 15 రోజుల పాటు ఎసిబి విచారణకు దూరంగా ఉన్న సండ్రకు ఆంధ్రప్రదేశ్ ఎసిబి అధికారులతో శిక్షణ ఇప్పించినట్టు తెలిసిందంటూ బుధవారం మీడియాలో వార్తలు వచ్చాయి ఏసీబీ అధికారులు వేసే పలు ప్రశ్నలను ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి సమాధానాలు చెప్పాలి? అనే అంశాలపై శిక్షణ ఇప్పించినట్లు సమాచారం ఉందంటూ మీడియా కథనాలు వచ్చాయి.
మంగళవారం సండ్రకు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించగా, ఆయనను విచారించడం ఇంకా పూర్తి కాలేదని తమకు మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరారు. ఒకవేళ మారోమారు సండ్ర ఏసీబీ కస్టడీకి వస్తే ఎవరెవరి పేర్లు బయటికి వస్తాయోనని టిడిపి నేతలు భయపడుతున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎవరు ఎవరితో మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అనే కాల్ డేటాను కూడా ఏసీబీ అధికారులు ముందస్తుగా తీసుకోవడం వల్ నోటీసులు అందుకున్న నేతలకు ఎంత తర్ఫీదు ఇచ్చినా అవి పనిచేయడం లేదని అంటున్నారు.
సండ్ర ఎసిబి విచారణకు హాజరై, అరెస్టయిన కీలక సమయంలో తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అందుబాటులో లేకపోవడం కూడా టిడిపి నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్టన్లు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఎమ్మెల్యేలు, మెదక్ జిల్లా నేత, మహబూబ్‌నగర్‌లోని మరో ఎమ్మెల్యే గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు రాబట్టేందుకు బాధ్యతలు తీసుకున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications