వైసీపీలోకి పులివెందుల సతీష్ రెడ్డి
TDP Janasena alliance: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన మధ్య ఎట్టకేలకు సీట్ల పంపకాల వ్యవహారం తేలింది. 118 మంది అభ్యర్థులతో కూడిన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.
ఇందులో 94 నియోజకవర్గాల్లో టీడీపీ, 24 చోట్ల జనసేన అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. చంద్రబాబు, కింజరాపు అచ్చెన్నాయుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ వంటి ప్రముఖుల పేర్లు టీడీపీ జాబితాలో చోటు చేసుకున్నాయి. జనసేన తొలి జాబితాలో పవన్ కల్యాణ్ పేరు లేదు.

తమ పార్టీకి 24 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలను మాత్రమే కేటాయించడం పట్ల జనసేన క్యాడర్ భగ్గుమంటోంది. అనేక చోట్ల పార్టీ నాయకులు రాజీనామాలు చేస్తోన్నారు. తెలుగుదేశం పార్టీ జెండాలనూ తగులబెడుతున్నారు. నారా లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవడానికి చంద్రబాబు ఆడిన నాటకంగా విమర్శిస్తోన్నారు.
తాజాగా కడప జిల్లా పులివెందుల నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకుడు, శాసనమండలి మాజీ వైస్ ఛైర్మన్ సతీష్ రెడ్డి.. పార్టీకి గుడ్‌బై చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకోనున్నారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి సతీష్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదు చంద్రబాబు. పులివెందుల టికెట్‌ను మరో సీనియర్ నాయకుడు బీటెక్ రవికి కేటాయించారు. దీనితో టీడీపీని వీడాలని సతీష్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ నెల 26వ తేదీన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరుతారని తెలుస్తోంది.
కడప జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, సురేష్ బాబు.. సతీష్ రెడ్డిని కలిశారు. తమ పార్టీలో చేరాలంటూ ఆహ్వానించారు. దీనికి ఆయన అంగీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తమ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని గుర్తు చేశారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications