వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆత్మరక్షణలో టిడిపి: నోరెత్తని మంత్రులు, రేవంత్‌పై వేటుకు ఒత్తిడి?

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారనే వార్తల నేపథ్యంలో తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

మోత్కుపల్లికి రేవంత్ షాక్:' నన్ను ప్రశ్నించే అధికారం లేదు', 'అతనో చీడపురుగు'మోత్కుపల్లికి రేవంత్ షాక్:' నన్ను ప్రశ్నించే అధికారం లేదు', 'అతనో చీడపురుగు'

విదేశీ పర్యటనలో టిడిపి జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఉన్నారు. బాబు విదేశీ పర్యటన నుండి తిరిగి రాగానే తెలంగాణ టిడిపి పరిణామాలపై పార్టీ నేతలతో చర్చించనున్నారు. అయితే బాబు హైద్రాబాద్‌కు తిరిగి వచ్చేలోపుగానే పార్టీ నుండి సస్పెన్షన్ వేయాలని తెలంగాణ నేతలు డిమాండ్ చేయాలనే ఒత్తిడి తెస్తున్నారు.

టి.టిడిపిలో రేవంత్ 'చిచ్చు': అక్టోబర్ 26న, టిడిఎల్పీ సమావేశం, ఏం జరుగుతోంది?టి.టిడిపిలో రేవంత్ 'చిచ్చు': అక్టోబర్ 26న, టిడిఎల్పీ సమావేశం, ఏం జరుగుతోంది?

తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ఊహగానాలు వస్తున్నాయి. అంతేకాదు ఈ నెల 17వ, తేదిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్‌గాంధీతో రేవంత్‌రె్డ్డి ఢిల్లీలో సమావేశమయ్యారని సమాచారం.ఈ వార్తలపై రేవంత్ మాత్రం నోరు విప్పడం లేదు.

కెసిఆర్ కాళ్ళకు దండం పెడితే తప్పేంటీ: రేవంత్‌పై పరిటాల శ్రీరామ్ ఫైర్కెసిఆర్ కాళ్ళకు దండం పెడితే తప్పేంటీ: రేవంత్‌పై పరిటాల శ్రీరామ్ ఫైర్

అయితే కాంగ్రెస్ పార్టీ నేతలను కలిస్తే తప్పేముందని రేవంత్‌రెడ్డి చేస్తున్న ఎదురు ప్రశ్నించడంతో రేవంత్ వ్యవహరశైలిపై ఆ పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.పొత్తుల వ్యవహరమే పార్టీలో చిచ్చకు కారణమైందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.

రేవంత్‌పై సస్నెన్షన్‌కు ఒత్తిడి

రేవంత్‌పై సస్నెన్షన్‌కు ఒత్తిడి

టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే వార్త తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. రేవంత్ ఢిల్లీ వెళ్లి రహస్యంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసిన రేవంత్ ఆ తర్వాత ఏపీలోని టీడీపీ నేతల, మంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశానికి రేవంత్ హజరయ్యారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు మోత్కుపల్లి నర్సింహ్ములు, అరవింద్‌కుమార్‌గౌడ్‌లు రేవంత్‌పై విరుచుకుపడ్డారని సమాచారం. అయితే రాహూల్‌తో సమావేశమైన విషయమై స్పష్టత ఇవ్వలేదు. దరిమిలా రేవంత్‌పై సస్పెన్షన్ వేటు వేయాలని పార్టీ సీనియర్లు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు.

ఆత్మరక్షణలో టిడిపి నాయకత్వం

ఆత్మరక్షణలో టిడిపి నాయకత్వం


రేవంత్ రెడ్డి వ్యవహరంలో టిడిపి నాయకత్వం ఆత్మరక్షనలో పడింది. ఏపీ మంత్రులపై తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన విమర్శలపై నోరు మెదపకూడదని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. అయితే విదేశీ పర్యటనకు వెళ్ళే ముందు చంద్రబాబునాయుడు ఈ విషయమై పార్టీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావును మధ్యవర్తిగా పంపారు. అయితే చంద్రబాబునాయుడు విదేశీ పర్యటన నుండి వచ్చిన తర్వాతే ఈ విషయమై తాడో పేడో తేలనుంది.

ఆ మంత్రులు ఎందుకు నోరు విప్పలేదు

ఆ మంత్రులు ఎందుకు నోరు విప్పలేదు


ఏపీకి చెందిన మంత్రులపై టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై ఆ మంత్రులు నోరు విప్పలేదు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశం మేరకే వారు నోరు విప్పలేదా , లేకపోతే రేవంత్ చేసిన ఆరోపణలపై స్పందిస్తే పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు నెలకొనే అవకాశం ఉందని భావించి నోరెత్తడం లేదా అనే చర్చ సాగుతోంది. ఏపీకి చెందిన ఇద్దరు కీలక మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టులు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేశారు.ఏపీ రాజకీయాల్లో ఈ ఆరోపణలు సంచలనంగా మారాయి.

మరిన్ని విషయాలు బయటపెడతానంటున్న రేవంత్

మరిన్ని విషయాలు బయటపెడతానంటున్న రేవంత్

సరైన సమయంలో మరిన్ని విషయాలను బయటపెట్టనున్నట్టు తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చెబుతున్నారు. అసలు పార్టీ నేతల తీరును రేవంత్‌రెడ్డి బయటపెడతారా.... అసలు ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది. రేవంత్ రెడ్డి వ్యూహం మాత్రం అంతుచిక్కడం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే మాత్రం ఆయన తనతో కొందరు నేతలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్ళే అవకాశాలు కూడ లేకపోలేదు.

English summary
Tdp leaders demanded to take suspension on Revanth Reddy.There is a spreadiang a rumour on Telangana Tdp working president Revanth Reddy.Tdp senior leader mothkupally Narsimulu said that Revanths leadership the party voting had comedown from 22 percent to 7 percent in Telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X