చంద్రబాబుకు టీ టీడిపి నేతల సంఘీభావం.!మౌనదీక్ష చేసిన మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన.!
హైదరాబాద్ : ఆంద్ర ప్రదేశ్ లో జరిగిన రాజకీయ పరిణామాల పట్ల తెలంగాణ తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందించింది. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును వైసీపీ నాయకులు అవమానపరిచిన తీరు సిగ్గుమాలిన చర్య అని తెలంగాణ తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. ప్రపంచంలోని తెలుగువారందరూ ఖండించవలసిందిగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ కార్మిక విభాగంతో పాటు అన్ని అనుబంధ సంస్థల నాయకులు స్పష్టం చేసారు. పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని ఇలా అవమానించడం ప్రజా స్వామ్యానికే అవమారకరమని, ఎదుటివారిని పల్లెత్తు మాట కూడా అనని చంద్రబాబుని వైసిపి ఎమ్మెల్యేలు, మంత్రులు నోటికొచ్చినట్టు తిడుతూ అవమానపరుస్తూ మాట్లాడడం హేయమైన, బాధాకరమైన చర్య అని ధ్వజమెత్తారు తెలంగాణ నేతలు. అంతే కాకుండా వైసీపీ నేతల ఆగడాలను చూస్తుంటే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా మరెక్కడైనా ఉన్నామా అనే అనుమానం కలుగుతుందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు.

అంతే కాకుండా విజ్ఞత కలిగిన తెలుగు ప్రజలు ఆలోచించవలసిన తరుణం ఆసన్నమైందని, చంద్రబాబునే కాకుండా ఏ రోజు రాజకీయాలు మాట్లాడని, రాజకీయాలతో సంబంధం లేని ఆయన భార్య భువనేశ్వరి దేవిని కూడా కించపరుస్తూ నిండు సభలో అవమానకరంగా మాట్లాడటం అత్యంత బాధాకరమని, నీతిమాలిన చర్యలని మండిపడ్డారు. వైసీపి ఎమ్మెల్యేలు, మంత్రులు అహంకారంతో వ్యక్తిగతంగా బాబును, వారి కుటుంబ సభ్యులను అసభ్యకరంగా అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తన్నట్టు తెలిపారు. అందులో భాగంగా రసూల్ పుర ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన మౌనదీక్ష చేసారు. చంద్రబాబు నాయుడిని, ఆయన భార్యను, కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిండుసభలో వైసీపి నాయకులు దారుణంగా నిందించడం, అవమానించడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ రసూల్ పురలో ఎన్టీఆర్ విగ్రహం తెలంగాణ టీడిపి నాయకులు మౌనదీక్ష చేపట్టారు. టిడిపి కార్యకర్తలు, అభిమానులు హాజరై చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు.













Click it and Unblock the Notifications