రేపు చేరిక: కేసీఆర్‌తో టీడీపీ మంచిరెడ్డి, మరికొందరూ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి బుధవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో భేటీ అయ్యారు.
మంచిరెడ్డి తెరాసలో చేరుతున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఆయన కేసీఆర్‌ను కలవడం మరింత చర్చనీయాంశమైంది. మంచిరెడ్డి గురువారం నాడు అధికారికంగా తెరాసలో చేరే అవకాశముందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని కేసీఆర్‌కు చెప్పారని సమాచారం.
మంచిరెడ్డి ఒక్కరే కాకుండా పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు తమ పార్టీలో చేరుతారని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు చెబుతున్నారు. తమతో చాలామంది టచ్‌లో ఉన్నారని వారు చెబుతున్నారు.

ఇప్పటికే తలసాని శ్రీనివాస యాదవ్, తీగెల కృష్ణా రెడ్డి, ధర్మారెడ్డి వంటి శాసనసభ్యులు తెరాసలో చేరగా తాజాగా మరో మంచిరెడ్డి కారు ఎక్కనున్నారని తెలుస్తోంది. మంచిరెడ్డి, పార్టీ కార్యకర్తలతో ఇటీవలే సమావేశమయ్యారని తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు, అభిమానులు సమావేశంలో పాల్గొన్నారు.
తెరాసలో చేరే అలోచనను మంచిరెడడ్ి కార్యకర్తల ముందు ఉంచినట్లు వార్తలు వచ్చాయి. సోమవారంనాడే ఆయన తెరాసలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన సోమవారంనాడు తన సన్నిహితులు, ముగ్గురు జడ్పీటిసీలు, మరికొందరు సర్పంచులతో సమావేశమై ఆ విషయం చర్చించారు.
తెరాసలో చేరాలని తనపై తీవ్రమైన ఒత్తిడి వస్తోందని, క్షేత్రస్థాయిలో ఒక్క పని కూడా జరగడం లేదని మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నట్లు సమాచారం. అందుకే తాను టిఆర్ఎస్‌లో చేరే విషయంపై ఆలోచన చేస్తున్నట్లు ఆయన అన్నారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డిని పార్టీలోకి తెచ్చే విషయాన్ని టిఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు అప్పగించినట్లు తెలుస్తోంది.
నియోజకవర్గం కోసమే
తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే తెరాసలో చేరుతున్నానని కేసీఆర్‌తో భేటీ అనంతరం మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఈ నెల 24న తెరాసలో చేరుతానని చెప్పారు. టీడీపీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశానన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications