ఘన స్వాగతం: ఎల్బీ నగర్‌లో రేవంత్ రెడ్డి, టీడీపీలోకి టీఆర్ఎస్ కార్యకర్తలు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో కోర్టు ఆదేశాల మేరకు నిన్నటి వరకు తన సొంత నియోజక వర్గం కొడంగల్‌కే పరిమితమైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపనేత రేవంత్ రెడ్డి బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు.
సొంత నియోజకవర్గానికి పరిమితం కావాలన్ని నిబంధనను కోర్టు మంగళవారం ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలు వెలువడిన మర్నాడే రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం కొడంగల్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు.
హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌కు బుధవారం మధ్యాహ్నాం 12 గంటల ప్రాంతంలో చేరుకున్న రేవండ్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎల్పీ నగర్ పరిధిలోని టిఆర్ఎస్‌కు చెందిన పలువురు నాయకులతో పాటు కాంగ్రెస్ మైనార్టీ నేత రేవంత్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.

రేవంత్ రెడ్డికి గతంలో బెయిల్ ఇచ్చిన హైకోర్టు, కొడంగల్ నియోజకవర్గాన్ని దాటి రావొద్దని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు ఆయన తన సొంత నియోజకవర్గానికి పరిమితమయ్యారు. తాజాగా, మంగళవారం న్యాయస్థానం ఆయనకు భారత దేశంలో ఎక్కడైనా తిరిగేలా షరతులు సడలించింది.
అయితే, ప్రతి సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ఎసిబి కార్యాలయానికి హాజరు కావాలని కోర్టు ఆదేశించించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications