వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపికి అసెంబ్లీలోకి మరోసారి నో ఎంట్రీ, రేవంత్ కు కెసిఆర్ చెక్ ఇలా..

ముస్లీంలు, ఎస్ టీల రిజర్వేషన్ల కోటా పెంపు కోసం నిర్వహించనున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో టిడిపి సభ్యులకు ప్రవేశం అనుమానంగానే కన్పిస్తోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:ముస్లీంలు, ఎస్ టీల రిజర్వేషన్ల కోటా పెంపు కోసం నిర్వహించనున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో టిడిపి సభ్యులకు ప్రవేశం అనుమానంగానే కన్పిస్తోంది.

బిఏసీ సమావేశం నుండి టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను పాల్గొనకుండా నిలిపివేయడంతో అసెంబ్లీ సమావేశాల్లో ఇదే పరిస్థితి కన్పించే అవకాశం లేకపోలేదనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను మూడు రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. రిజర్వేషన్ల పెంపు అంశంపై చర్చించేందుకుగాను ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. ముస్లింలకు, ఎస్ టీ లకు రిజర్వేషన్లను పెంచనున్నారు.

ఈ రిజర్వేషన్ల కోటా పెంపుతో పాటు ఇతర బిల్లులపై అసెంబ్లీలో చర్చ జరగనుంది.ఈ అంశాలపై చర్చించేందుకుగాను ఆదివారం నుండి (ఏప్రిల్ 16) అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

రేవంత్, సండ్రకు అసెంబ్లీలోకి పర్మిషన్ నో

రేవంత్, సండ్రకు అసెంబ్లీలోకి పర్మిషన్ నో

ఇటీవల నిర్వహించిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా టిడిపి ఎమ్మెల్యేలు సభ సంప్రదాయాలకు విరుద్దంగా వ్యవహరించారని ఆరోపిస్తూ టిడిపి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు.

అసెంబ్లీ సమావేశాల్లో వారు సమావేశాల్లో పాల్గొనకుండా నిలువరించారు.అయితే ఈ సస్పెన్షన్ అసెంబ్లీ సమావేశాలకే పరిమితమౌతోందని భావించారు. కాని , ప్రత్యేక సమావేశాలకు కూడ ఈ సస్పెన్షన్ వర్తించే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

బిఎసీ సమావేశానికి పిలిచి సండ్రను పంపేశారు.

బిఎసీ సమావేశానికి పిలిచి సండ్రను పంపేశారు.


రిజర్వేషన్ల పెంపు అంశంపై ప్రత్యేకంగా ఆదివారం నుండి నిర్వహించే అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకొని శనివారం నాడు (ఏప్రిల్ 15) బిఏసీ సమావేశాన్ని నిర్వహించారు.

అయితే ఈ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్వహించిన బిఎసీ సమావేశంలో టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను పాల్గొనకుండా అసెంబ్లీ సిబ్బంది అడ్డుకొన్నారు.అయితే ఈ సమావేశాలకు టిడిపి తరపున బిఎసీ సమావేశాల్లో పాల్గొనాల్సిందిగా స్పీకర్ కార్యాలయం నుండి తమకు ఆహ్వానం వచ్చినట్టుగా టిడిపి ఎమ్మెల్యేలు చెబుతున్నారు.ఈ ఆహ్వానాన్ని పురస్కరించుకొని బిఎసీ సమావేశానికి హజరుకాకుండా టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను అసెంబ్లీ సచివాలయ సిబ్బంది అడ్డుకొన్నారు.

సస్పెన్షన్ కొనసాగుతోంది

సస్పెన్షన్ కొనసాగుతోంది


బడ్జెట్ సమావేశాల సందర్భంగా విధించిన సస్పెన్షన్ టిడిపి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలకు రిజర్వేషన్ల పెంపుపై నిర్వహించే ప్రత్యేక సమావేశాలకు కూడ వర్తిస్తోందని అసెంబ్లీ సచివాలయ వర్గాలు తెలిపాయి.

అయితే ఈ సస్పెన్షన్ వర్తిస్తే ఎందుకు బిఎసీ సమావేశానికి ఆహ్వానించారని టిడిపి ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు.బిఏసీ సమావేశాలకు హజరుకాకుండా పిలిచి అవమానిస్తారా అంటూ టిడిపి ప్రశ్నిస్తోంది.

టిఆర్ఎస్ కార్యాలయమా?

టిఆర్ఎస్ కార్యాలయమా?

నిబంధనలను పక్కనబెట్టి టిఆర్ఎస్ కార్యాలయంగా అసెంబ్లీని నడుపుతున్నారని టిడిపి శాసనసభపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి చెప్పారు. మంత్రి హారీష్ రావు కనుసన్నల్లోనే అసెంబ్లీ కార్యదర్శి సదారాం నడుచుకొంటున్నారని ఆయన ఆరోపించారు.

స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదన్నారు.బిఏసీ సమావేశాలకు పిలిచి అవమానించడం దారుణమన్నారు. అసెంబ్లీ కార్యదర్శి సదారాం ను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

నియంతలకు పట్టిన గతే కెసిఆర్ కు కూడ

నియంతలకు పట్టిన గతే కెసిఆర్ కు కూడ

బీఏసీ సమావేశానికి పిలిచి ఆ తర్వాత బయటకు వెళ్ళాలని చెప్పడం అత్యంత అవమానకరమని టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చెప్పారు. ప్రభుత్వం టీడీపీ గొంతు నొక్కుతోందన్నారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో టిఆర్ఎస్ వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. చరిత్రలో నియంతలకు పట్టిన గతే ముఖ్యమంత్రి కెసిఆర్ కు పడుతోందని సండ్ర హెచ్చరించారు.

English summary
TDP MLA Sandra Venkata Veeraiah was denied entry into BAC meeting on Saturday. The security staff told the MLA that he was not allowed to attend the meeting as he was suspended from the house for entire budget session.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X