ఫేస్‌బుక్: ఎస్ఐ భార్యను మోసగించిన టీచర్
హైదరాబాద్: ఫేస్‌బుక్‌ను ఆసరాగా చేసుకుని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఉపాధ్యాయుడు నగరంలోని ఓ ట్రాఫిక్ ఎస్సై భార్యను మోసం చేశాడు. మంగళవారం నిందితున్ని అదుపులోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కేసు వివరాలు మీడియాకు తెలిపారు. యూసుఫ్‌గూడ ప్రాంతంలో నివసించే ఓ ట్రాఫిక్ ఎస్సై భార్య ఇటీవల కనిపించకపోవడంతో జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
కాగా, పోలీసుల విచారణతో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల హమాలీవాడలో నివాసించే చల్లా జ్ఞానేశ్వర్ కాసిపేట మండలంలోని మల్కెపల్లి ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఫేస్‌బుక్‌లో యూసుఫ్‌గూడ ప్రాంతంలో ఉపాధ్యాయురాలిగా పనిచేసే ట్రాఫిక్ ఎస్సై భార్య(48)తో స్నేహం చేశాడు.
తనకు వివాహం కాలేదని నమ్మించాడు. ఆమెను మల్కెపల్లి రప్పించి ఆశ్రమ పాఠశాలలో 15రోజులు ఉంచాడు. అక్కడ పాఠశాల సిబ్బంది అభ్యంతరం చెప్పడంతో మంచిర్యాలలో ఓ అద్దె ఇంట్లో ఆమెను ఉంచి తరచూ వచ్చిపోయేవాడు.

ఈ క్రమంలోనే కేసు విచారణ చేపట్టిన పోలీసులు బాధితురాలు మంచిర్యాలలో ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకొనిజూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జ్ఞానేశ్వర్‌కు గతంలోనే వివాహమైందని, ఒక కుమార్తె కూడా ఉందని విచారణలో తేలింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
వివాహితపై లైంగికదాడి
ఆదిలాబాద్: బెల్లంపల్లి మండలంలోని ఓ గ్రామంలో ఆదివారం రాత్రి ఓ వివాహితపై లైంగికదాడి జరిగినట్లు తాళ్లగురిజాల పోలీసులు పేర్కొన్నారు. వివరాలిలా ఉన్నాయి.. తాండూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత రోజు అదే గ్రామ శివారులో తన మేకలను మేతకోసం తీసుకువెళ్లేది. అదే గ్రామానికి చెందిన నరిగెల పోశం తన మేకలను మేత కోసం తీసుకెళ్తుండేవాడు.
ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న వివాహితను కొద్దిదూరం వెంబడించాడు. బ్లేడుతో బెదిరించి నిర్భందించి లైంగికదాడికి ఒడిగట్టాడు. కాగా, సోమవారం తెల్లవారుజామున పోశం బయటికి వెళ్లడం చూసి ఆమె తప్పించుకొంది. అదే రోజు రాత్రి బాధితురాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications