క్లాస్‌లోనే అశ్లీల చిత్రాలు, ఉపాధ్యాయుడికి దేహశుద్ది

మెదక్: కామంతో కళ్లు మూసుకుపోయి విద్యార్థినీల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది. అతనిని గ్రామస్థులు, విద్యార్థినీల తల్లిదండ్రులు చితకబాది పోలీసులకు అప్పగించారు.

మెదక్ జిల్లాలోని కూచన్‌పల్లిలో ఈ సంఘటన మంగళవారం జరిగింది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు గోపాల్ కొన్నాళ్లుగా తరగతి గదిలోనే తన సెల్ ఫోన్లో అశ్లీల చిత్రాలు చూస్తున్నాడు. వాటిని విద్యార్థినీలకు కూడా చూపిస్తూ వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.

మంగళవారం పలువురు ఏడుస్తూ ఉపాధ్యాయుడి తీరును తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో ఆగ్రహోద్రులైన తల్లిదండ్రులు, గ్రామస్థులు పాఠశాలకు చేరుకొని గోపాల్‌ను పట్టుకొని చితక్కొట్టారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతనిని అరెస్టు చేశారు.

Teacher beaten up for sexually harassing girl student

తాగిన మైకంలో తండ్రి చంపిన తనయుడు

తాగిన మైకంలో కొడుకు కన్నతండ్రిని కాలయముడిగా మారి హతమార్చిన సంఘటన దేవరకద్ర మండలంలో చోటు చేసుకుంది. దేవరకద్ర మండలంలోని వర్నె గ్రామానికి చెందిన బుచ్చన్న (50)ను ఆయన కుమారుడు వెంకటేష్ తాగిన మైకంలో గొంతుపై కాలుతో నుళిమి హతమార్చాడు.

బుచ్చన్న వ్యవసాయ పొలం వద్ద కంకర రాళ్లు ఉండగా వాటిని ఇతరులకు విక్రయించాడు. దీంతో బుచ్చన్నతో ఆయన కుమారుడు వెంకటేష్ గొడవకు దిగాడు. ఈ తరుణంలో తండ్రిని తీవ్రంగా కొట్టడంతో పాటు గొంతుపై కాళ్లు పెట్టి హతమార్చాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+