ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంటనష్టాన్ని పరిశీలిస్తున్న మంత్రులబృందం .. రైతులకు అండగా ఉంటామని హామీ
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల పంట నష్టం వాటిల్లిన ప్రాంతాలలో తెలంగాణా మంత్రుల బృందం పర్యటిస్తుంది. ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులను తెలంగాణా మంత్రుల బృందం పలకరిస్తుంది. వారి కష్టాలను నేరుగా అడిగి తెలుసుకుంటుంది. రైతుల కోసం తెలంగాణా సర్కార్ అండగా ఉంటుందని భరోసా ఇస్తుంది.

పంట నష్టం వాటిల్లిన ప్రాంతాలలో కేసీఆర్ పర్యటన రద్దు
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వడగళ్ల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతాంగం ఇటీవల కురిసిన వర్షాలతో తీవ్రంగా నష్టాలను చవిచూసింది. దీంతో అన్నదాతలు తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఈ నేపథ్యంలో సోమవారం నాటి కేబినెట్ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాల కారణంగా సంభవించిన పంట నష్టం పై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన స్వయంగా వరంగల్ జిల్లాలో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకుంటానని చెప్పారు. అయితే అనివార్య కారణాలవల్ల తెలంగాణ సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటన రద్దయింది.

మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు పంట నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో మంత్రుల బృందం
ఈ క్రమంలో మంగళవారం నాడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని తెలుసుకోవడానికి, రైతులకు భరోసా ఇవ్వడానికి పరకాల- నర్సంపేట సబ్ డివిజన్లలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తో పాటు ప్రజాప్రతినిధుల బృందం పర్యటన సాగుతోంది.పరకాల మండలం నాగారం, మల్లక్కపేట గ్రామాల్లోవడగండ్ల వానల ప్రభావంతో నష్టపోయిన పంటలను పరిశీలించిన మంత్రులు రైతులతో మాట్లాడారు. మంత్రులను చూడగానే కన్నీరుమున్నీరుగా విలపించిన బాధిత రైతులు తమను ప్రభుత్వం ఆదుకోవాలని మంత్రులకు విజ్ఞప్తి చేశారు.

క్షేత్ర స్థాయిలో పంట నష్టం పరిశీలిస్తున్న మంత్రులు
పంట నష్టాన్ని పరిశీలించిన మంత్రులు పంట నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రులతో కలిసి రైతు సమన్వయ బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా దర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు పంట నష్టపోయిన ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. వర్షాల వల్ల పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి రైతులు అధైర్యపడవద్దు ని అండగా ఉంటామని వెల్లడించారు.

దేశ పాలకుల వల్లే రైతులకు అన్యాయం జరుగుతుంది: మంత్రి నిరంజన్ రెడ్డి
నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, మంథనిలో మిర్చి పంట దెబ్బతిందని, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు రైతులకు జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించామని పేర్కొన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. దేశ పాలకుల అసంబద్ధ విధానాల మూలంగా రైతులకు న్యాయం జరగడం లేదని మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. దేశంలో వ్యవసాయ విధానాలు లోప భూయిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. రైతుకు వెన్నుదన్నుగా నిలిచింది దేశంలో కేసీఆర్ సర్కార్ మాత్రమేనని స్పష్టం చేశారు. దేశంలో రైతులకు ఉచిత కరంటు, రైతుబంధు, రైతుభీమా పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు.

రైతులకు న్యాయం చేస్తాం : మంత్రి నిరంజన్ రెడ్డి
ఎనిమిదో విడతతో రూ.50 వేల కోట్ల రైతుబంధు నిధులు రైతుల ఖాతాలకు చేరాయని వెల్లడించారు.అకాలవర్షాలతో కొన్ని ప్రాంతాలలో పంటలు దెబ్బతిన్న మాట వాస్తవం అన్నారు. నష్టపోయిన రైతుల పంటల వివరాలు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సేకరిస్తారని తెలిపారు. రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని,ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి పరిస్థితులను తీసుకెళ్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

కెసిఆర్ మాత్రమే రైతులకు సహాయం చేస్తారన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ బాధిత రైతులు అందరికీ న్యాయం చేస్తామని, కెసిఆర్ మాత్రమే రైతులకు సహాయం చేస్తారని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నామని చెప్పిన ఎర్రబెల్లి దయాకర్ రావు మిర్చి రైతుల పరిస్థితి బాధాకరంగా ఉందని తెలిపారు చేతికొచ్చిన పంట నేల పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. పరకాల, నర్సంపేట, భూపాలపల్లి పరిధిలో ఎక్కువ శాతం పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. రైతులు ధైర్యంగా ఉండాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి రైతుల సమస్యలను తీసుకుని వెళ్ళి వారికి న్యాయం చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications