టెక్కీ అరెస్టు: శిక్షణ అంటూ మోసం, డబ్బులు తీసుకొని ఇలా...
కొత్త వారికి శిక్షణ ఇస్తామని మోసం చేసిన కేసులో టెక్కీ శ్రీకాంత్ ను సైబరాబాద్ పోలీసులు గురువారం నాడు అరెస్టు చేశారు.ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.
హైదరాబాద్:కొత్తవారికి శిక్షణ ఇస్తామంటూ మోసం చేసిన కేసులో టెక్కీని సైబరాబాద్ పోలీసులు గురువారం నాడు అరెస్టు చేశారు. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.
కొత్త వారికి శిక్షణ ఇస్తామంటూ బెంగుళూరుకు చెందిన ఎం .శ్రీకాంత్ మోసం చేయడంతో ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.శ్రీకాంత్ గతంలో ఐబిఎం, డెల్లాయిట్ ,ఎరిక్సన్ సంస్థల్లో పనిచేశాడు.
మహరాష్ట్రలోని ఫూణె చిరునామాతో 4వీస్ కన్సల్టింగ్ అండ్ ట్రైనింగ్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు.సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు ట్రైనింగ్ ఇస్తామంటూ వివిద జాబ్ పోర్టల్స్ లో ప్రచారం చేసుకొన్నాడు.

వీటిలో శ్రీకాంత్ ఫ్రోఫైల్ చూసిన దోమలగూడలోని ఎలాంత్ర కన్సల్టెన్సీస్ సంస్థ సంప్రదించింది.16 మంది ట్రైనీలకు శిక్షణ ఇచ్చేందుకుగాను శ్రీకాంత్ రూ.2.79 లక్షలు తీసుకొని మోసం చేశాడు.
ఎలాంత్ర కన్సల్టెన్సీస్ నిర్వాహకుడు అషీత్ రాజ్ సక్సేనా ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకొని సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం నాడు శ్రీకాంత్ ను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications