ఇంట్లోకి చొరబడి బాలికపట్ల అసభ్యంగా, టెక్కీ అరెస్ట్: ఎసిబి వలలో జిహెచ్ఎంసి అధికారి

హైదరాబాద్: ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సాఫ్టువేర్ ఇంజనీర్‌ను బంజారాహిల్స్ పోలీసులు ఆదివారం నాడు అరెస్టు చేశారు. శ్రీనగర్ కాలనీలో ఉంటున్న విష్ణు అనే టెక్కీ నివసిస్తున్నారు. అతను నివసించే ఇంటి పక్కనే అపార్టుమెంటులో ఓ పదిహేనేళ్ల బాలిక ఉంటుంది.

అదివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో విష్ణు బాలిక ఇంట్లోకి చొరబడ్డాడు. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక అరిచింది. అతను అక్కడి నుండి పారిపోయాడు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు టెక్కీ పైన కేసు నమోదు చేసి, రిమాండుకు తరలించారు.

Techie booked for harass girl

జిహెచ్ఎంసీ సెక్షన్ ఆఫీసర్ ఇంట్లో సోదాలు

గ్రేటర్ హైదరాబాద్ కూకట్ పల్లి సర్కిన్ సెక్షన్ ఆఫీసర్ ఇమ్మాన్యూయెల్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. హైదరాబాద్, వరంగల్‌లో ఇతనికి రూ.5 కోట్లు ఆస్తున్నాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న అధికారిపై కేసు నమోదు చేశారు.

హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థి మృతి

అనుమానాస్పద స్థితిలో హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థి మృతి చెందాడు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గౌరీశంకర్ కుమారుడు సాయి కార్తీక్ బంజారాహిల్స్‌లోని రెజెన్సీ కాలేజీ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో రెండో ఏడాది చదువుతున్నాడు.

మాసాబ్ ట్యాంక్ అహ్మద్ నగర్ వద్ద కాలేజీ హాస్టల్లో ఉంటున్నాడు. శనివారం అర్ధరాత్రి సాయి కార్తీక్ గదిలో చనిపోయి కనిపించాడు. సమాచారం అందుకున్న కళాశాల యాజమాన్యం పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. తన కుమారుడి ఆరోగ్యం సరిగా లేదని మద్యం తాగుతాడని తండ్రి చెప్పాడు. మృతిపై అనుమానాలు లేవని తండ్రి చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+