హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్యాబ్‌లో టెక్కీపై లైంగిక దాడి: ఏఆర్ కానిస్టేబుల్ సహా నిందితులు వీరే

ఊరికి వెళ్లేందుకు రోడ్డుపై ఒంటరిగా వేచివున్న టెక్కీ యువతిని గమ్యస్థానం చేరుస్తామంటూ నమ్మించి ఆమెపై ఆత్యాచార యత్నం చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఊరికి వెళ్లేందుకు రోడ్డుపై ఒంటరిగా వేచివున్న టెక్కీ యువతిని గమ్యస్థానం చేరుస్తామంటూ నమ్మించి ఆమెపై ఆత్యాచార యత్నం చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను శుక్రవారం రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ మీడియాకు వివరించారు.

నమ్మించి అత్యాచారయత్నం

నమ్మించి అత్యాచారయత్నం

విజయవాడ వెళ్లేందుకు ఓ యువతి బుధవారం అర్థరాత్రి 2.30గంటల సమయంలో ఎల్బీనగర్‌ చౌరస్తా వద్ద వేచి ఉండగా.. తాము తీసుకెళ్తామని క్యాబ్‌ డ్రైవర్‌ చెప్పడంతో ఆమె నమ్మి కారెక్కింది. పంతంగి టోల్‌గేట్‌ దాటిన తర్వాత ఖాళీ ప్రదేశంలో కారు ఆపి... వేణు, ఇమ్మానియేల్‌ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. యువతి కేకలు వేయడంతో సమీపంలోని గ్రామస్థులు గమనించి రక్షించారు. క్యాబ్‌ డ్రైవర్‌, అతనితో పాటు మరో వ్యక్తి యువతిని వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు.

మీడియా ముందుకునిందితులు..

మీడియా ముందుకునిందితులు..

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు వేణు, ఇమ్మానియేల్‌ను అరెస్టు చేసినట్లు కమిషనర్‌ వెల్లడించారు. నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేసిన పోలీస్‌ సిబ్బందిని కమిషనర్‌ అభినందించి నగదు బహుమతి అందజేశారు. మహిళలు అర్థరాత్రి క్యాబ్‌లలో ప్రయాణించేటప్పడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా కమిషనర్‌ విజ్ఞప్తి చేశారు. షీ క్యాబ్స్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు.

గంజాయి స్మగ్లర్ రాజుసింగ్‌పై పీడీ యాక్ట్

గంజాయి స్మగ్లర్ రాజుసింగ్‌పై పీడీ యాక్ట్

పేరుమోసిన గంజాయి స్మగ్లర్‌ రాజుసింగ్‌ (41)పై పీడీ చట్టం ప్రయోగించారు. కొన్నేళ్లుగా ఎక్సైజ్‌, పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. అతనిపై నగరంలోని పోలీసు, ఎక్సైజ్‌ స్టేషన్లలో ఏనిమిది కేసులు నమోదై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌ శాఖ ఏఈఎస్‌ అంజిరెడ్డి నేతృత్వంలోని బృందంపై అతనిపై పగడ్భందీ ప్యూహంతో నేరాల చిట్టాను తయారు చేసి జిల్లా కలెక్టరు ముందు ఉంచడంతో కలెక్టరు రాహుల్‌ బొజ్జా శుక్రవారం సదరు నిందితుడిపై పీడీ చట్టం ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో నిందితుడిని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు.

హత్యాయత్నం కేసులో నిందితుల రిమాండ్

హత్యాయత్నం కేసులో నిందితుల రిమాండ్

యాకుత్ పురాలో సెగ్మెంట్ అల్ జాబ్రి కాలనీకి చెందిన దంపతులు మహ్మద్ సలీం, అబేదాసిద్దిఖీ, ఎర్రగుంటకు చెందిన ఆటో డ్రైవర్ షేక్ అరీఫ్ కు మధ్య స్వల్ప విషయానికే గొడవ జరిగింది. ఈ క్రమంలో షేక్ అరిఫ్(28), అతని స్నేహితులు మహ్మద్ మాజీద్(20), మహ్మద్ అహ్మద్ అలియాస్ ఫారుక్(20), సయ్యద్ రజాఅలీ(25)తో కలిసి కర్ర, కత్తితో మహ్మద్ సలీంపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన సలీంను ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. ఆయన భార్య అబేదా సిద్దిఖీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టిన క్రైం పార్టీ పోలీసులు.. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

English summary
A 26-year-old software engineer has managed to escape from the clutches of two miscreants, who tried to sexually assault her in a moving car on the Hyderabad-Vijayawada national highway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X