ఉప్మా బాగాలేదన్నందుకు మనస్తాపంతో టెక్కీ భార్య ఆత్మహత్య

హైదరాబాపద్: తాను తయారు చేసిన ఉప్మా బాగా లేదని చెప్పినందుకు మనస్తాపం చెందిన ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాదులోని కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జి ల్లా కడెంకు చెందిన ఎ.జ్ఞానేశ్వర్‌రాజు, మౌనిక (27) దంపతులు మూసాపేట ఆంజనేయనగర్‌లో నివసిస్తున్నారు.

జ్ఞానేశ్వర్‌ రాజు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా మౌనిక ఇంటివద్దే ఉంటుంది. ఇదిలావుంటే, జ్ఞానేశ్వర్‌రాజు తల్లి అనారోగ్యంతో నగరంలోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతోం ది. ఈ క్రమంలో అతడి పిన్నీ, చెల్లెలు, మేనమామలు ఇంటికి సోమవారం ఉదయం మౌనిక చేసిన అల్పాహారంగా ఉప్మా తిన్నారు.

Techie's wife commits suicide in Hyderabad

అయితే, ఉప్మా బాగా లేదని జ్ఞానేశ్వర్‌రాజు చెల్లెలు ఇంట్లో నుంచి బయటకి వెళ్లిపోవడంతో భార్యాభర్తల మధ్య స్వల్ప వాదన జరిగింది. దీంతో మనస్తాపం చెందిన మౌనిక బెడ్‌రూంలోకి వెళ్లి డోర్ వేసుకుంది. తల్లిని చూడడానికి జ్ఞానేశ్వర్‌రాజు హాస్పిటల్‌కు వెళ్లాడు.

మధ్యాహ్నం జ్ఞానేశ్వర్ చెల్లెలు తలుపు కొట్టినా మౌనిక తీయలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గది తాళం పగలగొట్టి చూడగా అప్పటికే మౌనిక ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని వేలాడుతోంది. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+