ఫ్లిప్‌కార్టుకు మోసం: ఐఫోన్ 6ను దొంగిలించిన టెక్కీల అరెస్టు
హైదరాబాద్: ఫ్లిప్‌కార్టును మోసగించి ఐఫోన్ 6ను దొంగిలించిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను హైదరాబాదులోని చిక్కడపల్లి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఐఫోన్ 6కు ఆర్డర్ ఇచ్చి, తమకు అది అందలేదంటూ దాన్ని దొంగిలించారు. ఇద్దరిలో ఒకరు టెక్ మహీంద్రలో పని చేస్తుండగా, మరొకతను అమెజాన్‌లో పనిచేస్తున్నాడు.
టెక్ మహీంద్రలో పనిచేస్తున్న బి నవీన్, అమెజాన్‌లో పనిచేస్తున్న అతుల్ శర్మలను చీటింగ్, దొంగతనం కేసుల కింద అరెస్టు చేసినట్లు చిక్కడపల్లి అదనపు ఇన్‌స్పెక్టర్ పి. బలవంతయ్య చెప్పారు. ఈ ఏడాది జనవరిలో ఐఫోన్ కోసం నవీన్ పేరు మీద ఫ్లిప్‌కార్ట్‌కు ఆర్డర్ పెట్టారు. అతుల్ శర్మ క్రెడిట్ కార్డు నుంచి 51 వేల రూపాయలు చెల్లించారు.

పార్సల్ వచ్చిన తర్వాత అందులో ఐఫోన్ లేదని, రబ్బరూ తెల్ల కాగితం మాత్రమే ఉందని ఫ్లిప్‌కార్ట్ అధికారులకు తెలిపారు. ఐఫోన్‌ను గోడౌన్ నుంచి తరలించారని, దాన్ని హైదరాబాదులో వాడుతున్నారని ఆడిట్‌లో తేలింది. దీంతో చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఐఎంఇఐ నెంబర్ ఆధారంగా ఆ ఫోన్‌ను అతుల్ సోదరుడు వాడుతున్నట్లు పోలీసులు కనిపెట్టారు. దాంతో ఐఫోన్‌ను దొంగలించారని పోలీసులు గుర్తించి వారిద్దరిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications