టెక్నాలజీ కీలకం: స్మార్ట్ తెలంగాణే లక్ష్యమన్న కెటిఆర్(పిక్చర్స్)

హైదరాబాద్: స్మార్ట్ హైదరాబాద్ మాత్రమే కాదు, స్మార్ట్ తెలంగాణ సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు స్పష్టం చేశారు. 'స్మార్ట్ సొల్యూషన్ ఫర్ స్మార్ట్ కమ్యూనిటీస్' అనే అంశంపై సోమవారం నగరంలో జరిగిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ప్రపంచంలోని స్మార్ట్ నగరాల్లో అభివృద్ధిని పరిశీలించి, హైదరాబాద్ నగరంలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా వీటిని అమలు చేస్తామన్నారు. దుబాయ్, లాస్‌ఏంజిల్స్‌తో పోటీ పడేవిధంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఆ నగరాలకున్న సౌకర్యాలు హైదరాబాద్‌కు ఉన్నాయన్నారు.

స్మార్ట్ నగరాల సమస్యలకు పరిష్కారాలు సూచించే స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించనున్నట్టు చెప్పారు. స్మార్ట్ సిటీల అభివృద్ధిపై జూలైలో నగరంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు కెటిఆర్ వెల్లడించారు.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

స్మార్ట్ హైదరాబాద్ మాత్రమే కాదు, స్మార్ట్ తెలంగాణ సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు స్పష్టం చేశారు.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

'స్మార్ట్ సొల్యూషన్ ఫర్ స్మార్ట్ కమ్యూనిటీస్' అనే అంశంపై సోమవారం నగరంలో జరిగిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

ప్రపంచంలోని స్మార్ట్ నగరాల్లో అభివృద్ధిని పరిశీలించి, హైదరాబాద్ నగరంలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా వీటిని అమలు చేస్తామన్నారు.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

దుబాయ్, లాస్‌ఏంజిల్స్‌తో పోటీ పడేవిధంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఆ నగరాలకున్న సౌకర్యాలు హైదరాబాద్‌కు ఉన్నాయన్నారు.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

స్మార్ట్ నగరాల సమస్యలకు పరిష్కారాలు సూచించే స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించనున్నట్టు చెప్పారు. స్మార్ట్ సిటీల అభివృద్ధిపై జూలైలో నగరంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు కెటిఆర్ వెల్లడించారు.

దేశంలో వంద స్టార్ట్ సిటీల అభివృద్ధికి కేంద్రం నిర్ణయించిందని, ఈ వంద నగరాలకు అవసరమైన టెక్నాలజీని అందించాలనే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉందని సదస్సులో పాల్గొన్న అధికారులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ సిటీల్లో అమలు చేస్తున్న టెక్నాలజీని పరిశీలించి, దేశంలోని వంద స్మార్ట్ సీటీలకు ఈ టెక్నాలజీని అందించాలనేది ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు.

ఇది తెలంగాణ ప్రజలకే కాకుండా దేశంలో అందరికీ ఉపయోగపడుతుందని ఐటి కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. దీనికోసం 12మంది సభ్యులతో కమిటీని వేశారు. కమిటీ స్మార్ట్ సిటీల్లో టెక్నాలజీపై నివేదిక ఇస్తుంది. దేశంలో వంద స్మార్ట్ సిటీలను ఎంపిక చేయగా, తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మంలను స్మార్ట్‌సీటి పథకంలో కేంద్రం ఎంపిక చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+