అన్నను ఏదైనా చేస్తారని యువతి సూసైడ్, తప్పొప్పుకున్న పోలీసులు

వరంగల్: తన సోదరుడిని పోలీసులు తీసుకు వెళ్లారని, ఏం చేస్తారోననే భయంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. ధర్మసాగర్‌ మండలం రాంపూర్‌కు చెందిన నరేశ్‌ను పోలీసులు కారణం చెప్పకుండా సోమవారం అర్ధరాత్రి తీసుకెళ్లారు.

దీంతో అన్నను ఏం చేస్తారోననే భయంతో అతని చెల్లెలు స్రవంతి మంగళవారం తెల్లవారుజామును తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల అత్యుత్సాహం కారణంగానే స్రవంతి మృతి చెందిందని గ్రామస్థులు ఆందోళన చేశారు.

బాధితుల కథనం ప్రకారం.. నరేష్‌కు సంబంధంలేని భూమి తగదా విషయంలో వారం రోజుల క్రితం ఫోన్లో పోలీసులు వివరాలు అడిగారు. భూతగాదాకు తనకు ఏవిధమైన సంబంధంలేదని పలుమార్లు వారికి చెప్పినప్పటికీ, వినలేదని, సోమవారం అర్ధరాత్రి సమయంలో స్థానిక ఎస్సై, కానిస్టేబుల్‌‌, పదిమంది పోలీసులు, వాహనాల్లో ఇంటికి వచ్చి నరేష్‌ను తీసుకు వెళ్లారు.

 Teenage girl commits suicide in Warangal district

ఉదయమే వస్తానని అతను చెప్పినా వినకుండా రాత్రి తీసుకు వెళ్లారు. సోదరి పోలీసుల కాళ్లమీదపడినా వినకుండా తీసుకెళ్లారన్నారు. స్టేషన్‌కు తీసుకెళ్లి మళ్లీ భూవిషయమై అడగగా, గతంలో చెప్పినదే అతను చెప్పాడు. అరగంట పాటు అతనిని పోలీసులు విచారించి, ఇంటి వద్ద వదిలేశారు.

అతను ఇంటికి వచ్చేసరికి అతని చెల్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తనను పోలీసులు ఏమైనా చేస్తారనే భయంతోనే ఆమె చనిపోయిందని బాధితుడు విలపించారు. మంగళవారం ఉదయం గంటలకు కాజీపేట ఏసీపీ, ఖాజీపేట, మడికొండ, హసన్‌పర్తి సీఐలు సంఘటన పూర్తి వివరాలు తెలుసుకున్నారు.

మృతురాలి తల్లిదండ్రులతో, గ్రామ పెద్దలతో మాట్లాడారు. పోలీసులపరంగా తప్పు జరిగిందని ఒప్పుకొన్నారు. బాధ్యులపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+