బాలుడిపై మరో బాలుడి అసహజ లైంగిక దాడి: భయంతో చిదిమేశాడు
పదేళ్ల బాలుడిపై 17 ఏళ్ల మైనర్ బాలుడు అసహజ లైంగిక దాడికి పాల్పడిన ఘటన హైదరాబాదులో సంచలనం సృష్ఠించింది. దాడి విషయం బయటపడుతుందనే భయంతో పదేళ్ల బాలుడిని ఆ తర్వాత అతను చంపేశాడు.
హైదరాబాద్: పదేళ్ల బాలుడిపై 17 ఏళ్ల మైనర్ బాలుడు అసహజ లైంగిక దాడికి పాల్పడిన ఘటన హైదరాబాదులో సంచలనం సృష్ఠించింది. దాడి విషయం బయటపడుతుందనే భయంతో పదేళ్ల బాలుడిని ఆ తర్వాత అతను చంపేశాడు. ఈ ఘోరాన్ని హైదరాబాదులోని చాంద్రాయణగుట్ట పోలీసులు ఛేదించారు.
సిసి కెమెరాల్లో చిన్న ఆధారం దొరకడంతో పోలీసులు కేసును ఛేదించారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ, ఇన్‌స్పెక్టర్ వై.ప్రకాష్ రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బార్కస్ బడా మసీదు ప్రాంతంలో ఉండే ఆటోడ్రైవర్ మహ్మద్ జమీల్‌ఖాన్‌కు ఐదుగురు కూతుళ్లు, నలుగురు కుమారులు.
వీరిలో పదేళ్ల చిన్న కుమారుడు మహమూద్ ఖాన్ స్థానిక లయోల స్కూల్‌లో 4 తరగతి చదువుతున్నాడు. గత నెల 28న ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహముద్ ఖాన్ రాత్రి అయినా రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దాంతో వారి ఇంటి సమీపంలోని సీసీ ఫుటేజీ పరిశీలించగా ఇంటి పక్కన ఉండే బాలుడు (17) మహమూద్‌ఖాన్‌ను తీసుకెళ్లినట్లు కనిపించింది. బుధవారం సాయంత్రం అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో తాను లైంగికదాడి చేసి ఆ బాలుడిని హత్య చేసినట్లు అంగీకరించాడు.

మేళాకు వెళదామని నమ్మించి...
బార్కస్‌లో వస్తువుల మేళాకు వెళదామని చెప్పి మృతుడు మహముద్ ఖాన్‌ను వెంట తీసుకెళ్లాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వెంట తిప్పుకుని సాయంత్రం 6 గంటల సమయంలో బార్కస్ మైదానం సమీపంలోని ప్రభుత్వ ఉన్నత బాలుర ఉర్ధూ పాఠశాల భవనంపైకి తీసుకెళ్లాడు. అతడిపై లైంగింకదాడి చేశాడు. నొప్పి తట్టుకోలేని బాలుడు తమ తండ్రికి విషయం చెప్తానని అనడంతో మహమూద్ ఖాన్ కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి భవనంపై ఉన్న ఇనుప రాడ్, కర్రలతో చితకబాది హత్య చేశాడు. మృతి చెందినట్లు నిర్ధారించుకుని వెళ్లిపోయాడు.

మృతదేహాన్ని మాయం చేయడానికి....
బాలుడి అదృశ్యం గురించి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జూన్ 29, 30 తేదీల్లో మృతదేహాన్ని మాయం చేయడానికి ప్రయత్నించాడు. తన ఒక్కడితో అది సాధ్యం కాకపోవడంంతో అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. అయితే ఈ పాఠశాలలో దాదాపుగా 500 మంది చదువుతున్నారు. భవనం పైభాగం పూర్తిగా పాడుబడింది.దాంతో ఎవరూ పైకి వెళ్లకపోవడంతో విషయం బయటకు తెలియలేదు.

సోదరి వివాహం ఉండడంతో....
తన తండ్రికి చెప్తానని బాధిత బాలుడు బెదిరించడంతో నిందితుడు భయాందోళనలకు గురయ్యాడు. జులై 2వ తేదీన తన సోదరి వివాహం ఉండడంతో బాలుడిపై తాను లైంగిక దాడి చేసినట్లు తెలిస్తే పెళ్లి ఆగిపోతుందని నిందితుడు భయపడ్డాడు. దాంతో బాధిత బాలుడిని చంపేశాడు. శవాన్ని మరో చోటికి మార్చడానికి రెండు సార్లు ప్రయత్నించాడు. అందుకు గాను శవం కాళ్లూ చేతులూ కట్టేశాడు. అయితే అది సాధ్యం కాకపోవడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు.

సిసి కెమెరాల్లో ఇలా.....
కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు బార్కాస్, చాంద్రాయణగుట్ట పరిసర ప్రాంతాల్లోని సిసి కెమెరాలను పరిశీలించారు. బడీ మసీదు ప్రాంతంలోని సిసి కెమెరాల ఫీడ్ సాంకేతిక కారణాల వల్ల ఓపెన్ కాలేదు. బుధవారం అది ఓపెన్ అయింది. 28వ తేదీ మధ్యాహ్నం 1.28 గంటలకు బాధిత బాలుడిని ఓ యువకుడు తీసుకుని వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బాలుడి తండ్రి ఆ యువకుడిని గుర్తించాడు. తమ ఇంటి పక్కనే ఉంటుండడంతో ఆ బాలుడిని అతను గుర్తించగలిగాడు.

ఎనిమిదో తరగిత చదివి...
ఎనిమిదో తరగతి వరకు చదివిన నిందితుడు ఓ పాన్‌షాపులో పనిచేస్తున్నాడు. పోలీసులు అతన్ని అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. 20 ఏళ్ల లోపు పిల్లకు స్మార్ట్‌పోన్లు ఇస్తుండడంతో ఇంటర్నెట్‌లో అశ్లీల వీడోలు చూస్తూ వాటికి బానిసలవుతున్నారని, దాంతో మైనర్లు విచక్షణ కోల్పోతున్నారని సౌత్ జోన్ డిసిప వి. సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications