వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమరులకు గౌరవం లేదు, డిసెంబర్ 3 అమరుల దినోత్సవంగా ప్రకటించాలి: రేవంత్ రెడ్డి

తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు గౌరవం దక్కడం లేదని ఎవరి త్యాగాల పునాదులపై రాష్ట్రం ఏర్పడిందో ఆ అమరవీరుల కోసం ఒక రోజును కేటాయించడానికి ప్రభుత్వానికి మనసు రావడం లేదన్నారు .

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు గౌరవం దక్కడం లేదని ఎవరి త్యాగాల పునాదులపై రాష్ట్రం ఏర్పడిందో ఆ అమరవీరుల కోసం ఒక రోజును కేటాయించడానికి ప్రభుత్వానికి మనసు రావడం లేదన్నారు టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి .

తెలంగాణ మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఆత్మబలిదానం చేసిన డిసెంబర్ 3వ, తేదిని అమరవీరుల దినోత్సవంగా ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుదవారం నాడు కెసిఆర్ కు ఓ బహిరంగ లేఖ రాశారు.

Telanagana Tdp working president Revanth Reddy open letter to Kcr

రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ కోసం తొలి ఉద్యమంలో 369 మంది మలి ఉద్యమంలో 1200 అమరులయ్యారని చెప్పారు. అమరుల కుటుంబాలకు, వ్యవసాయభూమి, రూ.10 లక్షల ఆర్థిక సహయం కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

అమరుల కుటుంబాలను గౌరవించే విషయంలో ప్రభుత్వ థృక్పథం మారినట్టు కనిపిస్తోందన్నారు. మూడేళ్ళు గడుస్తున్నా ఇప్పటికే 500 అమరుల కుటుంబాలకు మాత్రమే సహయం చేసి చేతులు దులుపుకొన్నారని చెప్పారు. మిగిలిన కుటుంబాలకు ఇప్పటికీ గుర్తించడం లేదన్నారు.

English summary
Telangana Tdp working president Revanth Reddy wrote a letter to Telangana chief minister Kcr on martyrs issue.he demanded to Kcr declares December 3 martyrs day .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X