భారత పాకిస్తాన్ సరిహద్దును సందర్శించిన 9ఏళ్ళ బాలుడు, కారణమిదే
9 ఏళ్ళ రవికరణ్ రెడ్డి అనే బాలుడు ఇండియా-పాకిస్తాన్ సరిహద్దును సందర్శించారు. ఈ సరిహద్దులో బిఎస్ఎఫ్ జవాన్లు చేసే విధులను ఆయన ప్రశంసిస్తూ లేఖ కూడ రాశారు.
హైదరాబాద్: 9 ఏళ్ళ రవికరణ్ రెడ్డి అనే బాలుడు ఇండియా-పాకిస్తాన్ సరిహద్దును సందర్శించారు. ఈ సరిహద్దులో బిఎస్ఎఫ్ జవాన్లు చేసే విధులను ఆయన ప్రశంసిస్తూ లేఖ కూడ రాశారు.
సరిహద్దుల్లో భారత జవాన్లు ప్రదర్శించే సాహసాలను ప్రశంసిస్తూ స్థానిక తెలుగు దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూసి స్పూర్తిని పొందారు రవికరణ్ రెడ్డి.

హైద్రాబాద్ లో నిజాంపేటకు చెందిన రవికరణ్ రెడ్డి స్థానిక దినపత్రికల్లో వచ్చే వార్తల ఆధారంగా బిఎస్ఎఫ్ జవాన్లను ధైర్య సాహసాలను ప్రశంసిస్తూ బిఎస్ఎఫ్ డిజి కె.కె. శర్మకు లేఖ రాశాడు.
సరిహద్దుల్లో పహరా కాస్తూ బిఎస్ఎఫ్ జవాన్లే నిజమైన హీరోలంటూ ఆయన ఆ లేఖలో ప్రశంసలు కురిపించారు.ఈ లేఖలను చదివిన బిఎస్ఎప్ డిజి కెకె శర్మ రవికరణ్ రెడ్డి కుటుంబాన్ని సరిహద్దులోకి రావాలని ఆహ్వనించారు.
రాజస్థాన్ లోని జైస్మెలేర్ ప్రాంతంలోని పాకిస్తాన్ -ఇండియా సరిహద్దులో నాలుగు రోజుల పాటు గడిపారు ఈ కుటుంబ సభ్యులు.












Click it and Unblock the Notifications