నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిద్రిస్తున్న ఎక్సైజ్ అధికారికి ఏసీబీ షాక్: లెక్కలేనన్ని ఆస్తులు(పిక్చర్స్)

ఇటీవల కాలంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు పని పెరిగిపోయినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే.. చాలా మంది అవినీతి అధికారులు పట్టుబడుతున్నారు. వారి అక్రమాస్తులను లెక్కేసేందుకు ఏసీబీ అధికారులకు చుక్కలే క

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్: ఇటీవల కాలంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు పని పెరిగిపోయినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే.. చాలా మంది అవినీతి అధికారులు పట్టుబడుతున్నారు. వారి అక్రమాస్తులను లెక్కేసేందుకు ఏసీబీ అధికారులకు చుక్కలే కనిపిస్తున్నాయి. తాజాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిజామాబాద్‌ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ బి జ్యోతికిరణ్‌ ఏసీబీకి చిక్కారు.

హైదరాబాద్‌లో పనిచేసి ఇటీవలే నిజామాబాద్‌కు బదిలీ అయిన జ్యోతి కిరణ్‌కు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు ఏసిబి అధికారులు గుర్తించారు. హైదరాబాద్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను గుర్తించినట్టు తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ తెలిపారు.

నిద్రిస్తున్న సమయంలోనే సోదాలు

నిద్రిస్తున్న సమయంలోనే సోదాలు

జ్యోతికిరణ్ ఇంట్లో ఏసీబీ అధికారులు ముంగళవారం సోదాలు చేశారు. నిజామాబాద్‌లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు ఉదయం 6 గంటలకు వచ్చి ఇంట్లో నిద్రిస్తున్న జ్యోతికిరణ్‌ను అదుపులోకి తీసుకొని వెంటనే హైదరాబాద్‌ తీసుకెళ్లారు. అద్దెకుంటున్న ఇంట్లో సోదాలు నిర్వహించగా.. ఏమీ దొరకలేదు. అక్కడి నుంచి సుభాష్‌నగర్‌లో ఉన్న ఎక్సైజ్‌ కార్యాలయానికి చేరుకున్నారు.

దస్త్రాలు, కంప్యూటర్ స్వాధీనం

దస్త్రాలు, కంప్యూటర్ స్వాధీనం


జ్యోతికిరణ్‌ ఛాంబర్‌లో దస్త్రాలు పరిశీలించి అనంతరం ఆయన ఉపయోగిస్తున్న కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జహీరాబాద్‌లో 30 ఎకరాల వ్యవసాయ భూమి కొన్నట్లు తెలియడంతో న్యాయస్థానం అనుమతితో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్‌ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు.

బంగారం, డబ్బు, ఇళ్ల స్థలాలు..

బంగారం, డబ్బు, ఇళ్ల స్థలాలు..

జ్యోతి కిరణ్‌కు చెందిన 30 ఎకరాల వ్యవసాయ భూమి, 2 రెసిడెన్షియల్ ఫ్లాట్లు, ఒక ఇండిపెండెంట్ ఇల్లు, 16 ఇళ్ల స్థలాలు, ఒక కిలో బంగారు ఆభరణాలు కూడబెట్టుకున్నట్టు అధికారులు గుర్తించారు. వీటి విలువ రూ. 1.53 కోట్లు కాగా, మార్కెట్‌లో రూ. 4 కోట్లకు పైగా ఉంటుందని ఏసిబి అధికారులు అంచనా వేశారు.

రూ.40కోట్ల వరకు అక్రమాస్తులు

రూ.40కోట్ల వరకు అక్రమాస్తులు

జ్యోతికిరణ్‌ బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేసినట్లు ఏసీబీ అధికారులు వివరించారు. రెండు నెలల కిందటే జ్యోతికిరణ్‌ హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ జిల్లాకు బదిలీపై వెళ్లారు. తొలుత నిజామాబాద్‌ వెళ్లడం ఇష్టం లేక సెలవుపై వెళ్లేందుకు సిద్ధపడగా.. ఉన్నతాధికారులు రెండు నెలలు పనిచేయండంటూ సర్దిచెప్పి పంపించినట్లు తెలిసింది. కాగా, జ్యోతికిరణ్ కూడబెట్టిన అక్రమాస్తుల విలువ దాదాపు 30-40కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అక్రమాస్తుల చిట్టా

అక్రమాస్తుల చిట్టా

జహీరాబాద్ న్యాకల్‌లో రూ. 18.07 లక్షలు విలుచేసే 30 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ బాగ్‌అంబర్‌పేట్‌లో రూ. 30.60 లక్షలు విలువచేసే రెసిడెన్షియల్ ఫ్లాట్, నల్లకుంటలో రూ.14.40 లక్షలు విలువ చేసే ఒక ఫ్లాట్, తిలక్‌నగర్‌లో రూ. 23లక్షలు విలువ చేసే ఒక ఇల్లు, రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లో సర్వే నెం. 259, 260లో రూ. 2.14 లక్షలు విలువచేసే ఒక ప్లాట్, హయత్‌నగర్ మండలం తుర్కయాంజాల్‌లో రూ. 1.60 లక్షలు విలువచేసే ఒక ఇంటి స్థలం, నల్గొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్‌లలో రూ. 13.30 లక్షలు విలువచేసే 11 ఇళ్ల స్థలాలు, భూదాన్ పోచంపల్లి, దుర్గా ఎస్టేట్‌లో రూ. 1.20 లక్షలు విలువచేసే ప్లాట్, రూ. 13.91 లక్షలు విలువచేసే 1.3 కిలోల బంగారు ఆభరణాలు, రూ. 10.13 లక్షల బ్యాంక్ డిపాజిట్, రూ. 9.65 లక్షలు విలవచేసే ఇన్సూరెన్స్ పాలసీలు, రూ. 8.41 లక్షలు విలువచేసే మారుతి స్విఫ్ట్ కారు, రూ. 1.20 లక్షలు విలువచేసే రెండు బైక్‌లు, రూ. 5 లక్షలు విలువచేసే గృహోపకరణాలు కలిగివున్నట్టు ఏసిబి అధికారులు గుర్తించారు. మంగళవారం జ్యోతికిరణ్‌ను ఏసిబి కోర్టులో హాజరుపరచి, కేసును దర్యాప్తు జరుపుతున్నట్టు ఏసిబి డైరెక్టర్ తెలిపారు.

English summary
Telangana Anti-Corruption Bureau (ACB) sleuths on Tuesday raided the premises of Nizamabad district excise superintendent Jyothi Kiran and seized properties, which could be worth 20 to 30 crores.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X