కోతలు తగ్గాయి: తెలంగాణలో విద్యుత్ మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉదయ్ పథకం ద్వారా దేశంలోని చాలా రాష్ట్రాలతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యుత్ కోతలు తగ్గిపోయాయి. ఇందుకు సంబంధించిన వివరాలు.. ఏప్రిల్, 2017 నుంచి కరెంటు కొరతను పూర్తి స్థాయిలో తగ్గించగలిగారు. ఏప్రిల్, 2017 నుంచి తీవ్ర కొరతను 0.2 శాతానికి తగ్గించగలిగారు.

అంతేకాదు, దక్షిణ భారతదేశం నుంచి సరఫరా అయ్యే ట్రాన్స్‌మిషన్ లైన్స్ పెంచడం వల్ల కరెంటు రేట్లను డబుల్ డిజిట్స్ నుంచి యూనిట్ కు రూ.3 వరకు తగ్గించగలిగారు.

ఉదయ్(ఉజ్వల్ డిస్కం అస్యూరెన్స్ యోజన): 24x7 కరెంటు అందించడానికి సమగ్ర సంస్కరణ:

ఈ సంస్కరణల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.6100కోట్ల వరకు లబ్ది చేకూరుతోంది. ఉదయ్ బాండ్స్ జారీ చేసిన వడ్డీ మదుపు, , ట్రాన్స్ మిషన్ కోతల్లో తగ్గింపులు, బొగ్గు సంస్కరణల వల్ల ఇది సాధ్యపడింది.

ఈ పరిణామంతో ఏటా రాష్ట్రానికి రూ.6100 కోట్ల డబ్బు ఆదా అవుతోంది.

power

ఉన్నత్ జ్యోతి-అందరికీ ఎల్ఈడీ(ఉజాలా)

ప్రపంచంలోనే అత్యధికంగా ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేస్తున్న దేశం భారత్.
ప్రతీ రాష్ట్రానికి 11.6 లక్షల పైచిలుకు ఎల్ఈడీ బల్బులు పంపిణీ అవుతున్నాయి. దీనివల్ల వినియోగదారులకు రూ.60 కోట్ల వరకు విద్యుత్తు బిల్లు ఆదా అవుతోంది.
డీఎంఎఫ్ కింద రాష్ట్రానికి సమకూరుతున్న మొత్తం: రూ.122.12కోట్లు(మార్చి 20నాటికి)

కోల్ మంత్రిత్వశాఖ సాధించిన విజయాలు

విద్యుత్ వినియోగం, బొగ్గు అమ్మకం కోసం రాష్ట్రానికి 3 ( తాడిచెర్ల-1, నైని, పెనగడ్డప్ప ప్రాంతాలలో) బొగ్గు గనులు కేటాయించారు. వీటిలో రెండు బొగ్గు గనులను ఈ-వేలం ద్వారా పూర్తి పారదర్శక పద్ధతిలో కేటాయించారు. ఈ బొగ్గు గనుల ద్వారా రాష్ట్రానికి రూ.2,942 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా.

బొగ్గు కొరత నుంచి మిగులు

అక్టోబర్ 21, 2014 నాటికి మూడింట్లో మూడు థర్మల్ ప్లాంట్లు ఏడు రోజుల నిల్వ కూడా ఏర్పాటు చేయడం కష్టంగా ఉండేది. కానీ, ప్రస్తుతం (ఏప్రిల్ 3, 2017 నాటికి ) ఏ ప్లాంటు‌లోనూ బొగ్గు కొరత అన్నది లేదు.

కొత్త మరియు పునరుత్పదక శక్తి మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలు

రెన్యూవబుల్ జనరల్ కెపాసిటీ

పునరుత్పాదక శక్తి తయారీ సామర్థ్యం గత మూడేళ్లలో 486 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో దీని సామర్థ్యం మార్చి 2014 నాటికి 264 మెగావాట్లు ఉండగా.. మార్చి 2017 పాటికి ఈ సామర్థ్యం 1546 మెగావాట్లకు పెరిగింది.

గనుల మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలు

జిల్లా ఖనిజ సంస్థ (డీఎంఎఫ్)ల ద్వారా ప్రధానమంత్రి ఖనిజ్ క్షేత్ర కళ్యాణ్ యోజన(పీఎంకేకేకేవై) అమలు చేయబడుతోంది. మొట్టమొదటిసారిగా పారదర్శక పద్ధతిలో గనుల వేలం, కేటాయింపు జరిగింది. దీని ద్వారా సమకూరిన ఆదాయాన్ని మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజల సాంఘిక, ఆర్థికాభివృద్ధి కోసం, మౌలిక వసతుల కల్పన కోసం వినియోగించడం జరుగుతోంది. జిల్లా ఖనిజ సంస్థ (డీఎంఎఫ్) కింద 2107 జూన్ 2 నాటికి రూ.268 కోట్లు సేకరించడం జరిగింది.  

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Energy shortage reduced to 0.1% during the period April, 2017 from 6.9% in 2013-14Peak shortage reduced to 0.5% during the period April, 2017 from 6.5% in 2013-14South Indian transmission lines increased by 116% thereby reducing short term electricity rates from double digits to around Rs. 3 per unit.
Please Wait while comments are loading...