ఒలంపిక్ ఎన్నికలు: వివాదం, బాబు ఫైర్ (ఫోటోలు)
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని ఒలింపిక్ సంఘాల ఎన్నికలు వివాదంగా మారాయి. ఆదివారం నాడు మరో రెండు సంఘాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఆంధ్రపదేశ్ ఒలింపిక్ సంఘం (ఏపీవోఏ) అధ్యక్ష, కార్యదర్శులుగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇక తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీవోఏ) అధ్యక్ష, కార్యదర్శులుగా ఎంపీ జితేందర్ రెడ్డి, జగదీశ్వర్ యాదవ్‌ను ఎన్నుకున్నారు. ఈ పదవులన్నింటికీ ఒక్కో అభ్యర్థి మాత్రమే పోటీలో ఉండడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైనట్టు రిటర్నింగ్ అధికారి, ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి డీఎస్‌ఆర్ వర్మ ప్రకటించారు.
ఇక అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న మంత్రి జగదీశ్ రెడ్డికి తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీవోఏ) చైర్మన్ పదవి దక్కింది. ఈ ఎన్నికలకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) పరిశీలకుడు హాజరుకాలేదు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) నుంచి డిప్యూటీ డైరెక్టర్ వెంకట రమణ పరిశీలకుడిగా హాజరయ్యారు.
బాబు ఆగ్రహం:
తెలుగుదేశం పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్, సీఎం రమేష్‌ల తీరుపై ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఒకింత అసహనాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఒకే పదవి కోసం ఇద్దరు ఎంపీలు పోటీపడడంపై ఆదివారం చంద్రబాబు వద్ద ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఒకే పార్టీలో ఉంటూ, ఒకే పదవికి ఇద్దరూ పోటీ పడి పార్టీ పరువును రచ్చ కీడ్చుతున్నారని బాబు ఆగ్రహాం వ్యక్తం చేసినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

ఒలంపిక్ ఎన్నికలు: వివాదం, బాబు ఆగ్రహం
ఆదివారం నాడు మరో రెండు సంఘాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఆంధ్రపదేశ్ ఒలింపిక్ సంఘం (ఏపీవోఏ) అధ్యక్ష, కార్యదర్శులుగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఒలంపిక్ ఎన్నికలు: వివాదం, బాబు ఆగ్రహం
ఆంధ్రపదేశ్ ఒలింపిక్ సంఘం (ఏపీవోఏ), తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీవోఏ) అధ్యక్ష ఎన్నికలు ముగిసిన అనంతరం మంత్రి జగదీశ్ రెడ్డిని అభినందిస్తున్న సీఎం రమేష్.

ఒలంపిక్ ఎన్నికలు: వివాదం, బాబు ఆగ్రహం
ఇక తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీవోఏ) అధ్యక్ష, కార్యదర్శులుగా ఎంపీ జితేందర్ రెడ్డి, జగదీశ్వర్ యాదవ్‌ను ఎన్నుకున్నారు. ఈ పదవులన్నింటికీ ఒక్కో అభ్యర్థి మాత్రమే పోటీలో ఉండడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైనట్టు రిటర్నింగ్ అధికారి, ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి డీఎస్‌ఆర్ వర్మ ప్రకటించారు.

ఒలంపిక్ ఎన్నికలు: వివాదం, బాబు ఆగ్రహం
ఇక అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న మంత్రి జగదీశ్ రెడ్డికి తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీవోఏ) చైర్మన్ పదవి దక్కింది. ఈ ఎన్నికలకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) పరిశీలకుడు హాజరుకాలేదు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) నుంచి డిప్యూటీ డైరెక్టర్ వెంకట రమణ పరిశీలకుడిగా హాజరయ్యారు.

ఒలంపిక్ ఎన్నికలు: వివాదం, బాబు ఆగ్రహం
ఉమ్మడి ఏపీవోఏను విభజించి ఏపీ, తెలంగాణకు ప్రత్యేక ఒలింపిక్ సంఘాలను ఏర్పాటు చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పునకు లోబడే ఎన్నికలు నిర్వహించినట్టు లగడపాటి రాజగోపాల్ తెలిపారు. కోర్టు సూచించిన రిటర్నింగ్ అధికారుల సమక్షంలో పూర్తి పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ ముగిసిందని అన్నారు.

Click it and Unblock the Notifications