ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎవరెస్టు అధిరోహించిన బృందంలో టీ లేడీ ఆఫీసర్ ఈమెనే (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అర్జున్‌ అవార్డు గ్రహీత బచినేపల్లి శేఖర్‌బాబు నేతృత్వంలోని ట్రాన్సెండ్‌ అడ్వెంచర్స్‌ బృందం శుక్రవారం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్‌ను అధిరోహించింది. శేఖర్ బాబు తెలంగాణలోని నల్లగొండ జిల్లాలోని భువనగిరి రాక్ క్లైంబింగ్ స్కూల్‌కు చెందినవారు.

ఎవరెస్టు అధిరోహించిన బృందంలో టీ లేడీ ఆఫీసర్

దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఐదుగురు పర్వతారోహకులు ఈ ఘనత సాధించారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నారు. ఈ బృందం ఏప్రిల్ 5వ తేదీన హైదరాబాదు నుంచి బయలుదేరి, 13వ తేదీన ఖాట్మండు చేరుకుంది.

పర్వాతారోహణ చేసిన బృందంలో తొలి ఐఎఫ్‌ఎస్‌ అధికారి ఎస్‌.ప్రభాకరన్‌, మహారాష్ట్ర ఐపీఎస్‌ అధికారి సొహైల్‌శర్మ, ఆదిలాబాద్‌ జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్‌ జీఆర్‌ రాధిక, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గిరిజనుడు డి.భద్రయ్య, తమిళనాడుకు చెందిన బాలన్‌ శివరామన్‌ ఉన్నారు.

లేడీ ఆఫీసర్ ఈమెనే

మహారాష్ట్రలోని పుణేకు చెందిన మున్నె అశోక్‌ (దివ్యాంగుడు) బేస్‌క్యాంప్‌ 3 వరకు చేరుకున్న తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఎవరెస్ట్‌ను అధిరోహించలేకపోయారు.

English summary
A ten-member-team from Telangana and Andhra Pradesh states summitted Mount Everest on Friday. Adilabad district additional SP G.R. Radhika and a few IPS and IFS officials were among the team members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X