వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోదావరి ఉగ్రరూపం: భద్రాచలంలో భయానకం - 3వ ప్రమాద హెచ్చరిక - సర్వత్రా టెన్షన్..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సహా ఎగువ రాష్ట్రాల్లో ఐదు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. నిండుకుండలా నది ఉప్పొంగుతుండటంతో పరివాహక ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఆదివారం సాయంత్రానికి భద్రాచలం వద్ద నీటి మట్టం 53 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

అడ్డొస్తే రామ్ పోతినేని‌పై చర్యలు - విజయవాడ ఏసీపీ వార్నింగ్ - అంతలోనే హీరో మరో ట్విస్ట్అడ్డొస్తే రామ్ పోతినేని‌పై చర్యలు - విజయవాడ ఏసీపీ వార్నింగ్ - అంతలోనే హీరో మరో ట్విస్ట్

భద్రాచలం వద్ద ఆదివారం ఉదయం నీటి మట్టం 48.1 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. చూస్తుండగానే, గంటల వ్యవధిలో నదీ ప్రవాహం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. నీటిమట్టం మధ్యాహ్నానికి 52 అడుగుకు, సాయంత్రానికి 53 అడుగులకు చేరడంతో మూడో వరద హెచ్చరిక జారీ అయింది. ఈ రాత్రికి వరద ఉధృతి ఇంకా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ వానలు తగ్గకపోవడం, ఇంకో రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాల నేపథ్యంలో సర్వత్రా ఆందోళన నెలకొంది.

 After the water levels in the Godavari river at Bhadrachalam rose close to the danger mark crossing the 53-feet mark, the district officials have issued a third warning on Sunday, August 16. heavy rains in telangana and andhra pradesh continues.

భద్రాచలం సహా గోదావరి పరివాహక ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. చాలా గ్రామాల్లో ప్రజలు సామాన్లు సర్దుకుని సురక్షిత ప్రాంతాలకు బయలుదేరేందుకు రెడీ అయ్యారు. ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలంటూ తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అధికారులను ఆదేశించాయి. కేంద్ర, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

 After the water levels in the Godavari river at Bhadrachalam rose close to the danger mark crossing the 53-feet mark, the district officials have issued a third warning on Sunday, August 16. heavy rains in telangana and andhra pradesh continues.

గోదావరిలో వరద ఉధృతి ప్రమాదకర స్థాయికి చేరడం గడిచిన ఆరేళ్లలో ఇదే తొలిసారి. కేంద్ర జలమండలి రికార్డుల ప్రకారం 1986లో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 56.6 అడుగులకు చేరింది. 2014లో చివరిసారిగా మూడో వరద ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మళ్లీ ఆరేళ్ల తర్వాత వాటర్ లెవల్ 53 అడుగులకు చేరడంతో ఆదివారం మూడో వార్నింగ్ జారీ చేశారు.

మనిషి పుర్రెను కాల్చుకుని - విశాఖలో సైకో రాజు కలకలం - అతని ఇంట్లో ఓ యువతి..మనిషి పుర్రెను కాల్చుకుని - విశాఖలో సైకో రాజు కలకలం - అతని ఇంట్లో ఓ యువతి..

గోదావరి ప్రవహించే ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ లతోపాటు తెలంగాణ అంతటా వర్షాలు దంచికొడుతున్నాయి. హన్మకొండ, వరంగల్ సిటీలను వరద ముంచెత్తడంతో సుమారు 5వేల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్రస్థాయిలో వరద పరిస్థితిని పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 040-23450624 నెంబర్ కు ఫోన్ చేసి వరద పరిస్థితులపై సమాచారం తెలుసుకోవచ్చని అధికారులు చెప్పారు.

English summary
After the water levels in the Godavari river at Bhadrachalam rose close to the danger mark crossing the 53-feet mark, the district officials have issued a third warning on Sunday, August 16. heavy rains in telangana and andhra pradesh continues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X