స్పీకర్ పై ఎమ్మెల్సీ తాతా మధు షాకింగ్ కామెంట్స్.. కాంగ్రెస్ మంత్రుల ఫైర్, డిమాండ్!

శాసనసభ స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశాడని కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్పీకర్ అన్న మర్యాద లేకుండా ఎవడ్రా స్పీకర్, ఎవడ్రా మీకు అధికారం ఇచ్చింది అంటూ ఏక వచన సంబోధన చేయటమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించారని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు మండిపడ్డారు.

స్పీకర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అనుచిత వ్యాఖ్యలు.. మంత్రులు ఆగ్రహం

అసెంబ్లీ స్పీకర్ వంటి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై ఓ ఎమ్మెల్సీ బూతులు తిడుతూ, అమర్యాదకరంగా మాట్లాడటాన్ని మంత్రులు సీతక్క, దామోదర్ రాజనర్సింహ తీవ్రంగా ఖండించారు. మంత్రి సీతక్క స్పీకర్ ను దూషించిన ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ స్పీకర్‌ను కించపరిచేలా, అసభ్య పదజాలంతో మాట్లాడటం ప్రజాస్వామ్య వ్యవస్థకు, శాసనసభ గౌరవానికి అవమానకరం అని వారు పేర్కొన్నారు.

telangana assembly BRS MLC Tata Madhu Remarks on Speaker Spark row congress ministers demand

రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని కించపరుస్తారా?

రాజకీయ విభేదాలు ఉండవచ్చు. విధానాలపై విమర్శలు చేయవచ్చు. కానీ ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడటం ఏ విధంగానూ సమర్థనీయం కాదన్నారు. ప్రత్యేకించి, దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్నప్పటికీ ఆయనను అవమానించేలా మాట్లాడటం అత్యంత ఆందోళనకరమైన విషయం అని మంత్రి అన్నారు.

దళితుల పట్ల ఇలాంటి మానసిక వివక్ష బాధాకరమన్న మంత్రి

దళితులు ఉన్నత విద్యను అభ్యసించి, ఉన్నత స్థాయికి ఎదిగి, అత్యున్నత పదవులను అలంకరించినప్పటికీ వారిపై వివక్ష, చిన్నచూపు, అవమానకరమైన వ్యవహారశైలి ఇంకా కొనసాగుతుండటం దురదృష్టకరమన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఎనభై ఏళ్లు అవుతున్నా ఇప్పటికి కూడా దళితుల పట్ల ఇలాంటి మానసిక వివక్ష కొనసాగడం బాధాకరం అని దామోదర్ రాజనర్సింహ అన్నారు.

దళితులు ఎంత ఎదిగినా వారిపై చులకన ధోరణి

రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, గౌరవం కల్పించినప్పటికీ, దళితులు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా వారిని ఇంకా చిన్నచూపు చూసే మనస్తత్వం కొనసాగడం సమాజం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అంశమన్నారు.ఒక దళితుడు అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలకు గురికావడం కేవలం ఒక వ్యక్తిని అవమానించడం మాత్రమే కాదని, దళిత సమాజం పట్ల ఉన్న వివక్షపూరిత మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని మంత్రి అన్నారు.

కఠిన చర్యలకు డిమాండ్ చేస్తున్నకాంగ్రెస్ ఎమ్మెల్యేలు

ప్రజాప్రతినిధులు తమ హోదా, బాధ్యతలను గుర్తించి మాట్లాడాలని, పరస్పర గౌరవాన్ని పాటించాలని ఆయన సూచించారు. రాజ్యాంగ పదవుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందన్నారు.సదరు ఎమ్మెల్సీ గారిపై శాసనసభ నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను మంత్రి కోరారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన అద్దంకి దయాకర్ దళిత వర్గానికి చెందిన స్పీకర్‌ను అసభ్య పదజాలంతో అవమానించడం దారుణమన్నారు.

తెలంగాణ శాసనసభా పర్వం: 22Aపై చర్చకు సభలో బీజేపీ రచ్చ.. స్పీకర్ ఆగ్రహం!
తెలంగాణ శాసనసభా పర్వం: 22Aపై చర్చకు సభలో బీజేపీ రచ్చ.. స్పీకర్ ఆగ్రహం!

కేసీఆర్ సభకొచ్చి క్షమాపణ చెప్పాలి

దళితుల పోరాటాలతోనే అధికారంలోకి వచ్చి ఇవాళ బాగుపడ్డ కేసీఆర్, ఈ ఘటనపై వెంటనే సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్ తీరును 'బూతు రాష్ట్ర సమితి'గా అభివర్ణించిన ఆయన, అమలుకాని హామీలతో బిఆర్‌ఎస్ నేతలు కేవలం రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారనీ...మరి అమలు చేసిన హామీల పరిస్తితి ఏంటి అని ప్రశ్నించారు. . స్పీకర్‌పై అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+