పోటీ చేయకుండానే గెలుపొందిన టీడీపీ
తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకుంది. రేపో మాపో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ ఎన్నికల్లో ప్రధాన విషయం ఏమిటంటే.. తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉండటం. దీనిద్వారా ఆ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పోటీచేయకుండానే విజయం సాధించినట్లైంది. ఎన్నికల ప్రచారంలో భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల మెడలో వారి వారి పార్టీ కండువాలతోపాటు తెలుగుదేశం పార్టీ కండువాలు కూడా కనిపించాయి.
అన్ని పార్టీల నాయకులు చంద్రబాబు నామస్మరణ చేశారు. గతంలో ఏ ఎన్నికల సమయంలోను ఇటువంటి సందర్భాలు ఎదురుకాలేదు. ప్రత్యర్థి పార్టీ కండువాను మెడలో వేసుకోవడం అనేది బహుశా దేశ రాజకీయ చరిత్రలో ఇదే మొదటిసారి అవుతుందని భావించవచ్చు. తెలుగుదేశం మద్దతుదారులు, చంద్రబాబు అభిమానులు, ఆంధ్రా సెటిలర్ల ఓట్ల కోసం ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులంతా ప్రయత్నాలు కొనసాగించారు. గతంలో ఆ పార్టీ పోటీచేసిన ప్రతి సందర్భంలో గట్టి పోటీ ఇచ్చేది. ఈసారి మాత్రం పోటీలో నిలవకుండానే విజయం సాధించినట్లైంది.

తెలుగుదేశం పార్టీకి మ తెలంగాణ వ్యాప్తంగా అసంఖ్యాక అభిమానులు ఉన్నారు. పార్టీకి బలమైన క్యాడర్ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే ఇప్పటికీ తెలంగాణలో చాలా ప్రాంతాలలో పార్టీల జయాపజయాలను ప్రభావితం చేయగలిగిన సత్తా, బలం తెలుగుదేశం పార్టీకి ఉంది. చంద్రబాబు అక్రమ అరెస్ట్ విషయంలో రాష్ట్రంలో ఆందోళనలు జరిగాయి.
తెలంగాణాలో కాంగ్రెస్ విజయం వెనక చంద్రబాబు హస్తం ఉందని భావిస్తున్నారా ..??#Chandrababu #RahulGandhi #RevanthReddy #TelanganaAssemblyElectionResults2023 #ElectionResults #ElectionResults2023 #AssemblyElections2023 #ResultsWithOneindia #Oneindiatelugu
— oneindiatelugu (@oneindiatelugu) December 3, 2023
అయితే మంత్రి కేటీఆర్ వీటిపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం స్పందించలేదు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో బీఆర్ఎస్ కు నష్టం జరిగిందని భావించిన కేటీఆర్ నష్టనివారణకు చేయగలిగిన ప్రయత్నాలు చేశారుకానీ అవి ఫలితాన్నివ్వలేదు. ఏతావాతా ఇటువంటి పరిణామాలన్నీ భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణమయ్యాయి. పోటీలో లేకపోయినా తాము విజయం సాధించామనే సంతోషంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నాయి.












Click it and Unblock the Notifications