హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేరళతో కుదిరిన ఒప్పందం: పంబ నది తీరంలో తెలంగాణ భవన్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేరళలోని శబరిమల వెళ్లే తెలంగాణ యాత్రికులకు అక్కడ భవన్‌ను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. తెలంగాణ భవన్‌ నిర్మాణానికి బుధవారం అట్టహాసంగా ఎంఓయూ కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్ర యాత్రికుల కోసం ఐదు ఎకరాల్లో తెలంగాణ భవన్ నిర్మించనున్నారు.

ఇందుకు సంబంధించి ఇరు రాష్ర్టాల మధ్య ఒప్పందం కుదిరింది. శబరిమలలో అయ్యప్ప భక్తుల కోసం తెలంగాణ భవన్ నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయించే అంశంపై కేరళ ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది.

 కేరళతో కుదిరిన ఒప్పందం: పంబ నది తీరంలో తెలంగాణ భవన్

కేరళతో కుదిరిన ఒప్పందం: పంబ నది తీరంలో తెలంగాణ భవన్

పంబా న‌ది సంగ‌మం వ‌ద్ద ఇవాళ జరిగిన కాక్ర‌మంలో కేర‌ళ సీయం ఉమెన్ చాందీతో తెలంగాణ ప్రభుత్వం త‌ర‌పున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఇందుకోసం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి బుధారం ఉదయం కేర‌ళ రాష్ట్రానికి వెళ్లారు.

 కేరళతో కుదిరిన ఒప్పందం: పంబ నది తీరంలో తెలంగాణ భవన్

కేరళతో కుదిరిన ఒప్పందం: పంబ నది తీరంలో తెలంగాణ భవన్

తెలంగాణ నుంచి శ‌బ‌రి వెళ్లే అయ్యప్ప భ‌క్తుల కోసం ఐదెక‌రాల స్థలంలో భ‌వ‌న నిర్మాణంతో పాటు పార్కింగ్, క్యాంటీన్, డార్మెట‌రీ స్నానపు గ‌దులను నిర్మించ‌నున్నారు. సీఎం కేసీఆర్ చొర‌వ‌తో కేర‌ళ ప్రభుత్వం పంబ న‌దికి స‌మీపంలో నీల‌క్కల్ వ‌ద్ద స్థలాన్ని కేటాయించింది.

 కేరళతో కుదిరిన ఒప్పందం: పంబ నది తీరంలో తెలంగాణ భవన్

కేరళతో కుదిరిన ఒప్పందం: పంబ నది తీరంలో తెలంగాణ భవన్

అయ్యప్ప భక్తుల కోసం అక్కడ భవన్ నిర్మాణం తలపెట్టిన మొదటి రాష్ట్రం తెలంగాణ కావ‌డం విశేషం. శ‌బ‌రిమల యాత్రకు వెళ్లే తెలుగు మాట్లాడే భ‌క్తుల కోసం ప్రత్యేకంగా ఓ కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేయాల‌ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి గ‌తంలో కేర‌ళ సీఎంను కోరిన సంగతి తెలిసిందే.

కేరళతో కుదిరిన ఒప్పందం: పంబ నది తీరంలో తెలంగాణ భవన్

కేరళతో కుదిరిన ఒప్పందం: పంబ నది తీరంలో తెలంగాణ భవన్

దీనిపై కూడా కేరళ సీఎం ఉమెన్ చాందీ నుంచి సానుకూల హామీ లభించింది. ఎంఓయూ కార్యక్రమం ముగిసిన తర్వాత తెలంగాణ నుంచి వెళ్లిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సహా ప్రతినిధి బృందం అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. ఈ బృందం బుధవారం అక్కడే బస చేసి గురువారం ఉదయం హైదరాబాద్‌ తిరుగుపయనమైంది.

English summary
Telangana Bhavan at Sabarimala; MoU to be signed on wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X