బీజేపీ బీసీ డిక్లరేషన్‌లో కీలక అంశాలివే: భజరంగ్‌దళ్‌పై కుట్రంటూ బండి సంజయ్ ఫైర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో 50 శాతం మంది బీసీలుంటే.. కేవలం ముగ్గురికే మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు. హైదరాబాద్ నాగోల్‌లోని శుభం గార్డెన్స్‌లో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బీజేపీ ఓబీసీ సదస్సులో పాల్గొని ప్రసంగించారు.
వచ్చే నెల(జూన్)లో లక్ష మందితో హైదరాబాద్‌లో బీసీ గర్జన సభ నిర్వహిస్తామని బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్ కేటాయిస్తామని ఆయన స్పష్టం చేవారు. రాష్ట్రంలోని బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పిస్తామన్నారు. విదేశాల్లో చదివే బీసీ విద్యార్థులకు స్టాచురేషన్ పద్ధతిలో ఆర్థిక సాయం అందిస్తామమన్నారు బండి సంజయ్.

నామినేటెడ్ పదవుల్లోనూ బీసీలకు ప్రాధాన్యం ఇస్తామని బండి సంజయ్ చెప్పారు. హైదరాబాద్‌లోని పాతబస్తీ అభివృద్ధి చెందకపోవడానికి బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలే కారణమన్నారు. పాలకులు అనుసరించిన విధానాల కారణంగానే మెట్రో రావడం లేదన్నారు. ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ చట్టం తెచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదని అన్నారు. దాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్,ఎంఐఎం పార్టీలు వ్యతిరేకించాయన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో భజరంగదళ్‌ను నిషేధించేందుకు కేసీఆర్ ప్రభుత్వం కుట్రపన్నుతుందని బండి సంజయ్ ఆరోపించారు. నిజానికి రాష్ట్రంలోని ఏ ముస్లిం కూడా భజరంగదళ్ ను నిషేధించాలని కోరుకోవడం లేదన్నారు. తెలంగాణలో భజరంగ్ దళ్ కారణంగా గొడవలు జరగలేదన్నారు. హిందువుల ఐక్యత కోసమే భజరంగ్ దళ్ పనిచేస్తోందని స్పష్టం చేశారు. బీసీల ఆత్మ బలిదానంతో ఏర్పడిన తెలంగాణలో ఆ సామాజిక వర్గమే అన్యాయానికి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు బండి సంజయ్.
బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వంలోనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. బీసీలకు పెద్దపీట వేసిన మహానుభావుడు ఎన్టీఆర్ అని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత ఆయనదే అన్నారు. బీసీలకు ఉన్న రిజర్వేషన్లను కుదించిన చరిత్ర కేసీఆర్‌ది అని మండిపడ్డారు.
కేసీఆర్ బీసీల ద్రోహి అన్నారు కే లక్ష్మణ్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీల సీట్లను కేసీఆర్ ముస్లింలకు కేటాయించారని ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీసీ జనగణన ఎందకు చేయలేదని లక్ష్మణ్ ప్రశ్నించారు. సమావేశంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు శ్రీశైలం గౌడ్, నందీశ్వర్ గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలె భాస్కర్, గడీల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Live : Addressing “OBC Sammelanam” at ShubhamConvention https://t.co/t29FFEBBA1
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) May 18, 2023
బీజేపీ బీసీ డిక్లరేషన్‌లో కీలక అంశాలివే:
జనాభా ఆధారంగా బీసీలకు బడ్జెట్
రాష్ట్ర బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా
నామినేటెడ్ పదవుల్లోనూ పెద్దపీట
విదేశాల్లో చదివే బీసీ విద్యార్థులకు సంతృప్త స్థాయిలో సాయం
ఎన్నికల్లో గెలిచి రాలేని కులాలకు పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని బీజేపీ బీసీ డిక్లరేషన్ స్పష్టం చేసింది.
-
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
రోడ్డున పడుతున్న గిగ్ వర్కర్లు, ప్రత్యామ్నాయంగా..!! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications