బురదలో పంది.. ప్రకాష్ రాజ్‌పై తెలంగాణ బీజేపీ షాకింగ్ పోస్ట్
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో చోటుచేసుకున్న ఉగ్రమూకల దాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 'ఆపరేషన్ సింధూర్' పేరిట పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK) లోని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించి బదులు తీర్చుకుంది భారత్. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌లోని కీలక ఎయిర్ బేస్‌లను నేలమట్టం చేస్తూ.. మొత్తం 8 ఎయిర్ బేస్‌లను భారత ఆర్మీ భూస్థాపితం చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.
ఆపరేషన్ సింధూర్‌పై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్న తరుణంలో.. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. మోడీ నరనరాల్లో ప్రవహించేది దేశభక్తి కాదని.. ఆయన నరనరాల్లో ఎన్నికలే ప్రవహించేదని పోస్ట్ పెట్టారు. ఈ మేరకు హాస్పిటల్ సింధూర్.. సింధూర్ డొనేషన్ అని రాసి.. మోడీ రక్తంతో సింధూరం తయారు చేసి.. మహిళల నుదుటిన పెడుతున్నట్లు ఉన్న ఫోటోను షేర్ చేశారు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అయ్యింది.

ఈ మేరకు తెలంగాణ బీజేపీ ప్రకాష్ రాజ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆయనను బురదలో పందితో పోలుస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అందులో ఆయన నటించిన ఒక్కడు సినిమాలోని ఓ ఫోటోకు .. పక్కన మరో పద ఫోటోను పోస్ట్ చేసి రెండూ ఒకటేనా..? అని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ రెండు పోస్టుల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొందరు బీజేపీ నేతలు ప్రకాష్ రాజ్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతుంటే.. మరికొందరు మాత్రం ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ ఇస్తున్నారు.
తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో ప్రముఖ నటుడిగా పేరుగాంచిన ప్రకాశ్ రాజ్ విలక్షణ నటనకు ప్రసిద్ధి చెందారు. నెగటివ్, కారెక్టర్ రోల్స్‌తో ప్రేక్షకులను మెప్పించిన ఆయన నిర్మాతగా, దర్శకుడిగా కూడా ప్రశంసలు పొందారు. కేవలం నటుడిగానే కాకుండా రాజకీయంగా, సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని అయిన ముక్కుసూటిగా మాట్లాడే ప్రకాశ్ రాజ్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సైతం విమర్శలు గుప్పిస్తూ ఉంటారు.
Both are same ?#justsaying https://t.co/S0PPeb022n pic.twitter.com/voaBRdvUN5
— BJP Telangana (@BJP4Telangana) May 23, 2025












Click it and Unblock the Notifications