ప్రతి నెల రూ.2 వేల స్కాలర్ షిప్, విద్యార్థుల కోసం అభయహస్తం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. చదువు ద్వారానే జ్ఞానం, నైతిక విలువలు, సామాజిక అభివృద్ధి సాధ్యమవుతాయన్న మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని పలు విప్లవాత్మక నిర్ణయాలను ప్రకటించింది.

ముఖ్యంగా పేద విద్యార్థులకు బాసటగా నిలుస్తూ, ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది గ్రామీణ మరియు పేద విద్యార్థులకు ఎంతో ఊరటనిచ్చే అంశం.

Telangana Budget 2026-27 Free Mid-Day Meals for Inter Students and Rs 2000 Monthly ITI Scholarships Announced

విద్యార్థులకు నెలకు రూ. 2,000..

సాంకేతిక విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని ఐటీఐ (ITI)లు మరియు కొత్తగా ఆధునీకరించిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో (ATC) శిక్షణ పొందుతున్న విద్యార్థులకు నెలకు రూ. 2,000 చొప్పున స్కాలర్‌షిప్ అందించాలని నిర్ణయించింది. ఈ ఆర్థిక ప్రోత్సాహం విద్యార్థులకు వారి వృత్తి విద్యా కోర్సులను పూర్తి చేయడంలో గొప్ప సహకారాన్ని అందిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే 65 ఐటీఐలను ఏటీసీలుగా మార్చిన ప్రభుత్వం, అదనంగా మరో 53 సెంటర్లను మంజూరు చేయడం ద్వారా మొత్తం 118 అత్యాధునిక సాంకేతిక కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది.

అంతర్జాతీయ స్థాయి వసతులతో..

సామాజిక సమరసతను పెంపొందించే ఉద్దేశంతో 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్' (YIIR) పాఠశాలల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ విద్యార్థులందరూ ఎటువంటి వివక్ష లేకుండా ఒకే చోట అంతర్జాతీయ స్థాయి వసతులతో చదువుకునేలా రాష్ట్రవ్యాప్తంగా 105 పాఠశాలలను మంజూరు చేసింది.

వీటిలో ఇప్పటికే 79 పాఠశాలలకు పరిపాలన అనుమతులు లభించగా, 44 చోట్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పాఠశాలలను ఏర్పాటు చేయడం ద్వారా నాణ్యమైన విద్యను అందరికీ చేరువ చేయడమే లక్ష్యమని బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు.

1,362 పాఠశాలల్లో..

ప్రాథమిక విద్యను బలోపేతం చేసే దిశగా 33 జిల్లాల్లోని 1,362 పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రీ-ప్రైమరీ విభాగాలను ప్రారంభించినట్లు ప్రభుత్వం తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి వీటిని 2,500 పాఠశాలలకు విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. అలాగే బాలికా విద్యను ప్రోత్సహించడంలో భాగంగా 120 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలను (KGBV) ఇంటర్మీడియట్ స్థాయికి అప్‌గ్రేడ్ చేసింది. ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలను 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్'గా తీర్చిదిద్ది, అక్కడ డిజిటల్ తరగతులు, నిపుణులైన ఉపాధ్యాయులు మరియు ఉచిత రవాణా సౌకర్యాలను కల్పించడం ద్వారా ప్రభుత్వ విద్యారంగ ముఖచిత్రాన్ని మార్చాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+