తెలంగాణా బడ్జెట్ సమావేశాలు నేడు సభలో ఐదు కీలకబిల్లుల ఆమోదం!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి . నేడు తెలంగాణ అసెంబ్లీలో ఐదు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఐదు ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టడానికి ముందు అసెంబ్లీ సమావేశాల నుండి ఎంఐఎం సభ్యులు వాకౌట్ చేశారు. స్పీకర్ సభ నడుపుతున్న తీరును నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీని అసెంబ్లీ మాదిరిగా నడపాలని ఎంఐఎం సభ్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
నేడు సభలో కీలక బిల్లులు
ఎంఐఎం సభ్యుల వాకౌట్ అనంతరం అసెంబ్లీ సమావేశాలలో నేడు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు.తెలంగాణ SC హేతుబద్దీకరణ బిల్లు 2025, తెలంగాణవెనుకబడిన తరగతుల, SC, ST విద్యా సంస్థల్లో సీట్లు, రాష్ట్ర సర్వీసుల్లో నియమకాలు, పదవుల రిజర్వేషన్ బిల్లు 2025, తెలంగాణ ధార్మిక హిందూ, మత సంస్థల ధర్మాదాయాల సవరణ బిల్లు 2025 ను ప్రభుత్వం శాసనసభలో ప్రవేశ పెట్టింది.

బిల్లులు ప్రవేశపెట్టిన మంత్రులు
SC హేతుబద్దీకరణ బిల్లును ముఖ్యమంత్రి తరఫున ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ్జనరసింహ, BC బిల్లును BC సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో ప్రవేశ పెట్టారు.
స్థానిక సంస్థల్లో, విద్యా ఉపాధి కల్పనలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఈ బిల్లు ప్రతిపాదించింది. ధార్మిక హిందూ, మత సంస్థల ధర్మాదాయాల సవరణ బిల్లును దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శాసన సభలో ప్రవేశపెట్టారు.
శాసనసభలో బిల్లులు ఆమోదం
ఈ బిల్లులను శాసనసభ ఈ రోజే చర్చకు చేపట్టింది.ఆ తర్వాత ఈ బిల్లులపై పలువురు శాసనసభ్యులు మాట్లాడారు. అనంతరం ఈ బిల్లులు ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. కాగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సవరణ బిల్లును ముఖ్యమంత్రి తరఫున ఆరోగ్యమంత్రి దామోదర రాజనరసింహ శాసనసభలో ప్రవేశపెట్టారు.
పొట్టి శ్రీరాములు పేరు మార్పుపై సీఎం క్లారిటీ
ఈ సందర్భంగా బిల్లు ఉద్దేశ్యాలను వివరిస్తూ, తెలంగాణా వైతాళికుడు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు సురవరం ప్రతాపరెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. అయితే పొట్టి శ్రీరాములు పేరును మార్చటంపై ప్రస్తుతం రగడ కొనసాగుతుంది. గత శాసన సభలోనే పొట్టి శ్రీరాములు పేరు మార్చి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టే బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications