తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. దానితోపాటు వర్సిటీల్లో ప్రమాణాలపెంపు, మత్స్య సంపద అభివృద్ధి, ఆరోగ్యశ్రీకి చెల్లింపులపై విస్తృత అధ్యయనానికి మరో మూడు సబ్ కమిటీలను కూడా నియమించింది. వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ బకాయిల విడుదలకు పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సుదీర్ఘంగా జరిగిన క్యాబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది.












Click it and Unblock the Notifications