తెలంగాణలో ఏ కులం జనాభా ఎంత..! మొదటి 20 కులాలు ఇవే డేటా బయటపడింది

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. ఏ వర్గం ఎంత? ఎవరి సామాజిక స్థితిగతులు ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 'సామాజిక, ఆర్థిక, కుటుంబ సర్వే' (సీపెక్‌) నివేదిక వెలుగులోకి వచ్చింది. బుధవారం రాత్రి సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, సీఎస్ రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈ సమగ్ర డేటాను, నిపుణుల కమిటీ నివేదికను అధికారికంగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ సర్వే దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని ధీమా వ్యక్తం చేశారు. "రాహుల్ గాంధీ ఆలోచనలకు రూపమిస్తూ, ప్రతి ఇంటి గడప తొక్కి సేకరించిన ఈ సమాచారం సామాజిక న్యాయ సాధనలో మైలురాయి. పార్లమెంటులో బలం ఉందని కేంద్రం చేస్తున్న ఏకపక్ష నిర్ణయాలకు విరుద్ధంగా.. మేము ప్రజల అవసరాలను గుర్తించి ఈ డేటాను సిద్ధం చేశాం" అని ఆయన పేర్కొన్నారు. ఈ నివేదికను https://des.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, రాజకీయ పార్టీలు, కుల సంఘాలు ఇచ్చే సూచనల మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

Telangana Caste Survey Results Out Top 20 Castes Revealed as Govt Aims for Social Justice and Development

అంకెల్లో 'సమగ్ర సర్వే' వైభవం:

ఈ సర్వే కేవలం అంకెలు మాత్రమే కాదు, కోట్లాది మంది ప్రజల ఆశల ప్రతిబింబం.

  • రాష్ట్ర మొత్తం జనాభా: 3,54,77,554
  • పాల్గొన్న కుటుంబాలు: 1,12,36,849 (97.10 శాతం)
  • ప్రజల భాగస్వామ్యం: సుమారు 3.55 కోట్ల మంది.
  • క్షేత్రస్థాయి సిబ్బంది: 1.03 లక్షల మంది ఉద్యోగులు.
  • సేకరించిన అంశాలు: కులం, మతం, విద్య, ఉపాధి, భూమి, ఆస్తులు, వలసల వంటి కీలక సమాచారం.
సామాన్యులకు బిగ్ షాక్..! పెరగనున్న ధరలు.. దేశంలోనే తెలంగాణ టాప్..!
సామాన్యులకు బిగ్ షాక్..! పెరగనున్న ధరలు.. దేశంలోనే తెలంగాణ టాప్..!

తెలంగాణ సామాజిక సమీకరణాలు: టాప్-20 కులాలు

విడుదలైన డేటా ప్రకారం రాష్ట్రంలో జనాభా పరంగా ప్రధాన కులాల వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో మాదిగ సామాజికవర్గం అత్యధికంగా 10.3 శాతంతో ప్రథమ స్థానంలో ఉండగా, ఆ తర్వాత ముదిరాజ్ (7.4%), లంబాడీ (6.8%) వర్గాలు నిలిచాయి.

  • 1. మాదిగ (Madiga) - 36,57,551 (10.3%)
  • 2. ముదిరాజ్ (Mudiraj) - 26,39,027 (7.4%)
  • 3. లంబాడీ / బంజారా (Lambadis) - 24,04,056 (6.8%)
  • 4. యాదవ (Yadava/Golla) - 20,18,725 (5.7%)
  • 5. రెడ్డి (Reddy) - 17,10,244 (4.8%)
  • 6. గౌడ్ (Goud) - 16,30,187 (4.6%)
  • 7. మాల (Mala) - 14,71,514 (4.1%)
  • 8. మున్నూరు కాపు (Munnurukapu) - 13,75,018 (3.9%)
  • 9. పద్మశాలి (Padmasali) - 11,82,252 (3.3%)
  • 10. రజక (Rajaka) - 9,95,972 (2.8%)
  • 11. కురుమ / కురుబ (Kuruba/Kuruma) - 7,95,822 (2.2%)
  • 12. ఒడ్డు / వడ్డెర (Odde/Vaddera) - 6,43,571 (1.8%)
  • 13. ముస్లింలు (OC Muslims) - 6,32,782 (1.8%)
  • 14. అగ్నికులక్షత్రియ (Agnikulakshatriya) - 5,27,119 (1.5%)
  • 15. కొమటి / వైశ్య (Komati/Vaishya) - 5,08,813 (1.4%)
  • 16. నాయి బ్రాహ్మణ్ (Nayi Brahmin) - 4,33,785 (1.2%)
  • 17. కుమ్మర (Kummara) - 4,31,363 (1.2%)
  • 18. కొయ (Koya) - 4,28,142 (1.2%)
  • 19. వడ్రంగి (Vadrangi) - 4,07,927 (1.1%)
  • 20. గోండ్ (Gond) - 3,81,895 (1.1%)
తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ కీలక నిర్ణయం.. పని వేళలు పొడిగింపు
తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ కీలక నిర్ణయం.. పని వేళలు పొడిగింపు

కేంద్రానికి డిమాండ్.. భవిష్యత్ ప్రణాళిక!

ముందుగా కులగణన వద్దన్న కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు తెలంగాణ మోడల్‌ను చూసి అడుగులు వేయక తప్పలేదని మంత్రి పొన్నం ఎద్దేవా చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి, కంచ ఐలయ్య వంటి నిపుణుల కమిటీ సూచనల మేరకు ఏ వర్గంలో వెనుకబాటుతనం ఎక్కువగా ఉందో గుర్తించి, వారికి తగిన సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ తదుపరి లక్ష్యమని ఆయన ప్రకటించారు. తెలంగాణ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ఇదే తరహా సర్వే చేపట్టి ప్రధానమంత్రి మోదీ సామాజిక న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+