సామాన్యులకు బిగ్ షాక్..! పెరగనున్న ధరలు.. దేశంలోనే తెలంగాణ టాప్..!

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. దాదాపు 40 రోజులకు పైగా ఇరాన్- అమెరికా- ఇజ్రాయెల్ పై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దాడుల కారణంగా ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసింది. దాంతో ప్రపంచ దేశాలు ఇంధన సంక్షోభంలో మునిగిపోయాయి. భారత్ లోనూ పెట్రోల్, గ్యాస్ సిలిండర్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఇక భారత్ లో ప్రస్తుతం టోకు ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. 2026 మార్చిలో 3.88 శాతం పెరిగింది. ఫిబ్రవరిలో 2.13 శాతం ఉన్న ద్రవ్యోల్బణం మార్చి నాటికి 3.88 చేరుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు, గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ కారణంగానే టోకు ద్రవ్యోల్బణంలో ఈ మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక గతనెలలో 2.3 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం మార్చి నాటికి 3.88 చేరుకోవడం ఆందోళన కలిగించే అంశం. గత మూడేళ్లలో ఇదే అత్యధికం అని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ధరలు పెరుగడం వల్లే టోకు ద్రవ్యోల్బణం పెరిగిందని స్పష్టం చేశారు. అలాగే ఆహారేతర వస్తువులు, ఖనిజాల ధరలు కూడా పెరిగాయి. వీటితో పాటు మెటల్స్, టెక్స్ టైల్స్ అలాగే ఇతర రంగాల్లో కూడా ద్రవ్యోల్బణం పెరిగింది. 3.39 శాతానికి చేరుకుంది. అయితే టోకు ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ ఆహార ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించడం విశేషం.

India Wholesale Inflation Jumps to 3 88 in March from 2 13 in February Telangana Leads at 5 83

మార్చి నెలలో జాతీయ స్థాయిలో సగటు ద్రవ్యోల్బణం 3.40 శాతం నమోదైంది. అయితే యాభై లక్షలకు పైగా జనాభా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 5.83 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ 4.05 శాతంతో రెండో స్థానంలో ఉండటం గమనార్హం. ఈ రాష్ట్రాల తర్వాత కర్ణాటక 3.96 శాతం, తమిళనాడు 3.77 శాతం, రాజస్థాన్ 3.64 శాతంతో వరుసగా తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఇక తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో 6.64 శాతం, పట్టణ ప్రాంతాల్లో 5.24 శాతం ద్రవ్యోల్బణం నమోదైనట్లు గణాంకాలు చెబతున్నాయి. అలాగే ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చిలో మొత్తం ద్రవ్యోల్బణం 0.19 శాతం పెరిగింది. ఇక ఆహార సంబంధిత ద్రవ్యోల్బణం 0.4 శాతం పెరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+