తెలంగాణా సీఎంగా రేవంత్ రెడ్డి.. ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్; ప్రకటించిన కాంగ్రెస్!!

రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెర పడింది. అందరూ అనుకున్నట్టే జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తమ ముఖ్యమంత్రిని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు ఖరారైంది. ఈ మేరకు కేసి వేణుగోపాల్ కీలక ప్రకటన చేశారు. సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసినట్టు కేసీ వేణుగోపాల్ ప్రెస్ మీట్ నిర్వహించి కీలక ప్రకటన చేశారు.

కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్రంలోని సీనియర్ నాయకులతో చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేసి వేణుగోపాల్ తెలిపారు. ఢిల్లీలోని కేసి వేణుగోపాల్ నివాసంలో ఈ రోజు సీఎల్పీ నేతపై భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో డీకే శివకుమార్, మాణిక్ రావు ఠాక్రే తదితరులు పాల్గొన్నారు.

telangana chief minister revanth reddy.. congress high command announced

అందరు నేతలతో చర్చల అనంతరం రేవంత్ రెడ్డి ఒక డైనమిక్ లీడర్ గా గుర్తించి, సీనియర్ నాయకుల అభిప్రాయం మేరకు సీఎల్పీ నేతగా, తెలంగాణా సీఎంగా రేవంత్ రెడ్డి ఎంపిక జరిగిందని ఆయన తెలిపారు. ఆయన నాయకత్వంలో తెలంగాణా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నేరవేరుతాయన్నారు. ముఖ్యమంత్రి రేసులో ఉన్న భట్టీ విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో పెద్దలతో చర్చల్లో పాల్గొన్నారు.

ఈ క్రమంలో రేవంత్ రెడ్డిని ఢిల్లీ రావాలని అధిష్టానం పిలుపునిచ్చింది. అయితే మళ్ళీ ఏం జరుగుతుందో అని అందరూ టెన్షన్ పడుతున్న సమయంలోనే భట్టీ విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే కేసీ వేణుగోపాల్ ఈ ప్రకటన చేశారు. డిసెంబర్ 7 వ తేదీన రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఉంటుందని పేర్కొన్నారు.

ఏ క్షణంలోనైనా సీఎం పదవిపై ప్రకటన వస్తుందని భావించిన సమయంలో, కేసీ వేణుగోపాల్ ప్రెస్ మీట్ నిర్వహించి రేవంత్ రెడ్డే తెలంగాణా సీఎం అని ప్రటించారు. దీంతో రేవంత్ రెడ్డి సీఎం కావాలని కోరుకున్న వారు సంబరాలు జరుపుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+