అభివృద్ది సాధించిన జడ్పీలకు 10 కోట్ల ప్రత్యేక నిధులు .. సీఎం కేసీఆర్
గ్రామాల అభివృద్దికి పాటుపడిన జిల్లా పరిషత్‌లకు పది కోట్ల రూపాయలు ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇటివల ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌లు వైస్ చైర్‌పర్సన్‌లతో సీఎం సమావేశయ్యారు. ఈనేపథ్యంలోనే కొత్తగా ఎన్నికైన సభ్యులకు దిశనిర్ధేశనం చేశారు.పంచాయితీ రాజ్ ఉద్యమ స్పూర్తితో గ్రామాల అభివృద్దికి పాటు పడాలని సీఎం సూచించారు.
ఈనేపథ్యంలోనే రాష్ట్ర్రంలో ఇప్పటికే అభివృద్ది చెందిన గంగదేవీ పల్లే, ముల్కనూరు, అంకాపూర్ వంటి ఆదర్శ గ్రామాలుగా రాష్ట్ర్రంలోని ఇతర గ్రామాలను తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సంధర్భంగానే రానున్న ఆరు నెలల్లో పల్లేలో అభివృద్ది మార్పు కనిపించాలని ఆయన అన్నారు. ఇందుకోసం ప్రజా ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

కాగా గెలిచిన ప్రజా ప్రతినిధులు గెలిచిన గర్వంతో పని చేయవద్దని సూచించారు. పంచాయితీ రాజ్ చట్టంలో భాగంగా పంచాయితీ వ్యవస్థలను బలోపేతం చేయాలని చెప్పారు.ఈనేపథ్యంలోనే గ్రామీణ అభివృద్దికి పూర్వ వైభవం తీసుకురావాలని అన్నారు.ఇలా గ్రామాల్లో నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తి చేసిన జిల్లా పరిషత్‌లకు ప్రత్యేక నిధి ద్వార రూ.10 కోట్లను మంజూరు చేస్తామని ప్రకటించారు. ఇలా అన్ని జిల్లాలు పోటి పడి అభివృద్ది సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఇక కొత్తగా ఎన్నికైన చైర్మన్లకు కొత్త వాహానాలను అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు.తెలంగాణ సాధించిని విధంగానే గ్రామాల అభివృద్ది కూడ ముందుకు తీసుకుపోవాలని వారిని కోరారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications