హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మార్పు రావాలి, ధైర్యం లేదు: మోడీ ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు

|
Google Oneindia TeluguNews

కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రైతులకు మద్దతు ధర పెంచే ధైర్యం మోడీకి లేదని మండిపడ్డారు. రైతుల కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదన్నారు.

కేంద్రంపై తెలంగాణ నుంచి రైతులు పోరు ప్రారంభిస్తారన్నారు. ఈ పోరుకు అన్ని రాష్ట్రాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్‌లో నిర్వహించిన రైతుల సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

Telangana CM KCR hot comments on Modi government

దేశంలో రైతుల దుస్థితికి గత ప్రభుత్వాలే కారణమని మండిపడ్డారు. గత ప్రభుత్వాలు అవలంభించిన విధానాలు సరిగా లేవని, కానీ దేశాన్ని, రాష్ట్రాన్ని నాడు పాలించిన పార్టీలు ఇప్పుడు రోడ్డెక్కి ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్, బీజేపీని ఉద్దేశించి అన్నారు.

గుజరాత్‌లో కూడా పాస్ పుస్తకాల ప్రక్షాళణ సరిగా జరగలేదన్నారు. కర్నాటక ఎన్నికల కోసమే కావేరీ - గోదావరి సంగమం అన్నారు. తమ ఎంపీలు పార్లమెంటులో ఆందోళన చేస్తారని చెప్పారు. రైతులు సహనం కోల్పోతున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలన్నారు.

English summary
Telangana Chief Minister K Chandrasekhar Rao KCR hot comments on Modi government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X