హైకోర్టు విభజనపై చర్చ: రాజ్‌భవన్‌లో సుప్రీం సీజేఐతో కేసీఆర్ భేటీ
హైదరాబాద్: రాజ్ భవన్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్‌ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైకోర్టు విభజనపై ప్రధానంగా సుప్రీం సీజేఐతో సీఎం కేసీఆర్ చర్చించినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి హైకోర్టు ఉండటం వల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఆయనకు వివరించారని తెలుస్తోంది.
హైకోర్టును విభజించాలంటూ ఇటీవలే తెలంగాణ న్యాయవాదులు చేపట్టిన ఆందోళనలతో పాటు ఆ తర్వాత రాష్ట్రంలో తలెత్తిన పరిణామాలు వీరిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. సుప్రీం సీజేఐతో భేటీ అనంతరం రాజ్ భవన్‌లోనే గవర్నర్ నరసింహాన్‌తో కూడా కేసీఆర్ సమావేశమయ్యారు.
రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా తెలంగాణలో ఆదివారం ప్రధాని మోడీ పర్యటిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లపై గవర్నర్‌కు కేసీఆర్ వివరించారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోని గజ్వేల్ కోమటిబండలో మిషన్ భగీరథ పైలాన్ మోడీ ఆవిష్కరించనున్నారు. మోడీ పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందబోస్తు ఏర్పాటు చేశారు.
కాగా దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన నల్సార్ లా యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవం శనివారం జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో విందు ఇచ్చారు.

రాజ్‌భవన్‌లో సుప్రీం సీజేఐతో కేసీఆర్ భేటీ
కాగా దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన నల్సార్ లా యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవం శనివారం జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు

రాజ్‌భవన్‌లో సుప్రీం సీజేఐతో కేసీఆర్ భేటీ
ఆయనకు గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో విందు ఇచ్చారు.

రాజ్‌భవన్‌లో సుప్రీం సీజేఐతో కేసీఆర్ భేటీ
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరై కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలను అందజేయనన్నారు. శామీర్‌పేటలో గల యూనివర్సిటీ ప్రాంగణంలో సాయంత్రం 4నుంచి 6గంటల వరకు స్నాతకోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ బాలకిష్టారెడ్డి తెలిపారు.

రాజ్‌భవన్‌లో సుప్రీం సీజేఐతో కేసీఆర్ భేటీ
ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహాన్‌తో పాటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ కూడా పాల్గొననున్నారు. వర్సిటీ ప్రొఫెసర్లు, అధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొననున్నారు.












Click it and Unblock the Notifications