
కేసీఆర్ వ్యూహం అద్భుతహా!!
రాజకీయ వ్యూహాలు అల్లడంలో గండర గండుడైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన పాచిక విసిరారు. ఆయన పాచిక విసిరినట్లు కూడా తెలియకుండా నేతలంతా గిలగిలలాడుతున్నారు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీ ఉన్నాయి. టీఆర్ ఎస్‌లో ఉన్నవారు ఇతర పార్టీల్లోకి మారాలన్నా, తటస్థంగా ఉన్నవారు కాంగ్రెస్, బీజేపీవైపు చూస్తున్నా వారు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిని కల్పించారు.

హోరాహోరీగా ఎన్నికలు?
తెలంగాణ
అసెంబ్లీకి
జగరబోయే
ఎన్నికలు
హోరాహోరీగా
ఉంటాయని
జరుగుతున్న
పరిణామాలు
ఇప్పటికే
స్పష్టం
చేస్తున్నాయి.
కాంగ్రెస్,
బీజేపీతో
టీఆర్ఎస్
నువ్వా?
నేనా?
అనేరీతిలో
తలపడాల్సి
ఉంటుంది.
నేతల
మధ్య
మాటల
తూటాలు
పేలుతున్నాయి.
ఇటువంటి
తరుణంలోనే
ఆయా
పార్టీల్లోచేరి
ఎన్నికల్లో
పోటీచేయడానికి
కొందరు
నాయకులు
రంగం
సిద్ధం
చేసుకుంటున్నారు.
టీఆర్ఎస్
పార్టీలో
చేరడం
ఇష్టంలేనివారికి
బీజేపీ,కాంగ్రెస్‌మాత్రమే
ప్రత్యామ్నాయంగా
ఉన్నాయి.

పొత్తులపై స్పష్టత రావడంలేదే?
ఈ
రెండు
పార్టీల్లో
చేరదామా?
వద్దా?
అనే
సందేహంతో
పలువురు
నేతలు
ఆగిపోతున్నారు.
ఎందుకంటే
2024
ఎన్నికల
తర్వాతటీఆర్ఎస్
కాంగ్రెస్
పార్టీతో
పొత్తుపెట్టుకుంటుందనే
వార్తలు
చక్కర్లు
కొడుతున్నాయి.
మరోవైపు
బీజేపీకి
మద్దతిస్తుందంటూ
ఇంకో
వార్త
షికారు
చేస్తోంది.
ఇందులో
వాస్తవమెంతో
తెలియదుకానీ
నిజంగానే
పొత్తుపెట్టుకుంటే
తమ
పరిస్థితి
ఏమిటి
అనేది
వారి
మదిని
తొలిచేస్తోంది.
తెలంగాణ
రాష్ట్ర
సమితిలో
చేరడం
ఇష్టంలేనివారు
మిగతా
రెండు
పార్టీల్లో
చేరినప్పటికీ
ఏ
క్షణంలో
ఏ
పార్టీతో
పొత్తు
ఉంటుందో?
లోక్‌సభ
ఎన్నికల
తర్వాత
పరిస్థితి
ఎలా
ఉంటుందో
అన్న
సందేహం
వారిని
కుదుపులకు
గురిచేస్తోంది.

కొండానే ఉదాహరణ!
కాంగ్రెస్‌లోనే,
బీజేపీలోనో
చేరినతర్వాత
లేదంటే
ఎన్నికల
తర్వాత
అవసరార్థం
పొత్తులు
కుదిరితే
తమకు
విలువుంటుందా
అనే
బెంగ
వారి
వెంటాడుతోంది.
అందుకు
ఉదాహరణగా
చేవెళ్ల
మాజీ
ఎంపీ
కొండా
విశ్వేశ్వర్‌రెడ్డిని
రాజకీయ
విశ్లేషకులు
ఉదాహరణగా
చూపుతున్నారు.
కాంగ్రెస్,
బీజేపీ
రెండు
పార్టీలను
తేల్చుకోలేక
కొండా
అయోమయానికి
గురవుతున్నారని
చెబుతున్నారు.
ఏదేమైనప్పటికీ
ఇదంతా
ముఖ్యమంత్రి
కేసీఆర్
వ్యూహమేనని,
టీఆర్
ఎస్‌నువ్యతిరేకించే
నాయకులను
ఆయన
ఇలా
దిగ్భంధించారని
చెబుతున్నారు.